हैदराबाद : पहली बार टी-20 वर्ल्ड कप खेल रहे अमेरिका ने पाकिस्तान को गुरुवार देर रात हराकर हड़कंप मचा दिया। मैच का फैसला सुपर ओवर में हुआ, जहां बाबर आजम की टीम को हार झेलनी पड़ी। टॉस गंवाकर पहले बल्लेबाजी करते हुए पाकिस्तानी टीम 20 ओवर में सात विकेट खोकर 159 रन ही बना पाई। बाद में यूएसए के लिए नीतिश कुमार ने आखिरी गेंद पर चौका मारकर स्कोर टाई कर दिया। सुपर ओवर में यूएसए ने पहले बल्लेबाजी करते हुए 18 रन बनाए, लेकिन पाकिस्तान 13 रन ही बना पाया और मैच गंवा बैठा। इससे पहले भारत में जन्में अमेरिकी बल्लेबाज मोनांक पटेल ने कप्तानी अर्धशतक जमाया।
पाकिस्तान टीम की ओर से सुपर ओवर में अनुभवी गेंदबाज मोहम्मद आमिर ने छह के बदले नौ गेंदें फेंकी। यूएसए ने जो 18 रन बनाए उसमें सिर्फ एक ही बाउंड्री आई बचे हुए सारे रन एक्स्ट्राज और खराब फील्डिंग से आए। आरोन जोन्स ने पहली गेंद पर चौका मारा। दूसरी गेंद पर दो रन चुराए।तीसरी पर सिंगल लिया। अगली गेंद वाइड रही, जिसपर अमेरिका ने एक और रन चुरा लिया। चौथी गेंद पर फिर सिंगल आया। इसके बाद आमिर की खराब गेंदबाजी जारी रही। सुपर ओवर की अंतिम गेंद पर एक रन आया और बल्लेबाज रन आउट भी हुआ। इस तरह अमेरिका 18 रन बनाने में कामयाब रहा। जवाब में पाकिस्तान की टीम 13 रन ही बना पाई। आखिरी गेंद में जीत के लिए सात रन चाहिए थे, लेकिन शादाब खान सिंगल ही ले पाए।
अमेरिका टीम को आखिरी ओवर में जीत के लिए 15 रन चाहिए थे। पाकिस्तान के लिए इस स्कोर को बचाने की जिम्मेदारी अनुभवी तेज गेंदबाज हारिस रऊफ के कंधों पर थी। शुरुआती तीन गेंदों में उन्होंने शानदार प्रदर्शन करते हुए सिर्फ तीन रन ही दिए। अब आखिरी तीन गेंदों में 12 रन की जरूरत थी। यहां से पाकिस्तान फेवरेट लग रहा था, लेकिन चौथी गेंद पर आरोन जोंस ने छक्का जड़ दिया। आखिरा दो गेंदों में छह रन चाहिए थे। पांचवीं बॉल पर सिंगल आया तो पाकिस्तान फिर खुश हुआ क्योंकि आखिरी गेंद पर पांच रन चाहिए थे। सिर्फ छक्का मारकर ही अमेरिका जीत सकता था। स्ट्राइक पर नए बल्लेबाज नीतिश कुमार ने चौका मारते हुए स्कोर टाई कर दिया और मैच सुपर ओवर में चला गया।
यह भी पढ़ें-
अमेरिका टीम के कप्तान मोनांक पटेल ने टॉस जीतकर पाकिस्तान को बल्लेबाजी का न्योता दिया, जिसे उनके गेंदबाजों ने सही साबित करने में कोई कसर नहीं छोड़ी। पाकिस्तान ने 26 रन तक ही तीन विकेट गंवा दिए। दूसरे ओवर में भारत के पूर्व अंडर-19 क्रिकेटर सौरव नेत्रवलकर ने मोहम्मद रिजवान (09) को आउट किया। अगले ओवर में उस्मान खान (03) आउट हो गए। फखर जमां (11) ने बाएं हाथ के स्पिनर केनजिगे की पहली ही गेंद पर छक्का जड़ा लेकिन तेज गेंदबाज अली खान की गेंद पर शॉर्ट थर्ड मैन पर टेलर को कैच दे बैठे। पाकिस्तान की टीम पावार प्ले में तीन विकेट पर 30 रन ही बना सकी। बाबर आजम और (44) शादाब खान (40) ने तीसरे विकेट के लिए 76 रन की साझेदारी हुई। शादाब खान और आजम खान दो लगातार गेंदों में आउट हुए। अंत में शाहीन शाह अफरीदी (नाबाद 23) और इफ्तिखार खान (18) ने अंत में उपयोगी पारियां खेलकर टीम का स्कोर 150 रन के पार पहुंचाया।
టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం, సూపర్ ఓవర్‌లో పాక్ చిత్తు, అమెరికా విజయం
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం చోటు చేసుకుంది. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. మొదటి నుంచి పాక్‌కు చెమటలు పట్టించిన యునైటెడ్ స్టేట్స్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లి మరి సొంతం చేసుకుంది. గురువారం డల్లాస్ వేదికగా గ్రూప్ ఏలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్‌లో 5 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 159/7 స్కోరు చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన అమెరికా కూడా నిర్ణీత ఓవర్లలో 159/3 స్కోరు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. అక్కడ అమెరికా ఒక్క వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. 19 పరుగుల లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 13/1 స్కోరుకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో అమెరికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అమెరికాకు ఇది వరుసగా రెండో విజయం. మరోవైపు, పాక్ ఓటమితో ప్రపంచకప్‌ను మొదలుపెట్టింది.
బలమైన పాక్ బౌలింగ్ ముందు అమెరికా పోటీనిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకు తగ్గట్టే ఛేదనలో ఓపెనర్ టేలర్(12)ను నసీమ్ షా త్వరగానే అవుట్ చేశాడు. ఆ తర్వాత అమెరికా పుంజుకున్న తీరు అద్భుతం. మోనాంక్ పటేల్(50), గౌస్(35) సంచలన ఇన్నింగ్స్ ఆడారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరు సింగిల్స్ తీస్తూనే బౌండరీలు బాదతూ లక్ష్యాన్ని కరిగించారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో అమెరికా పోటీలోకి వచ్చింది.
ఈ క్రమంలో మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ వికెట్ పారేసుకోవడంతో పాక్ విజయం ఖాయమే అనిపించింది. అయితే, ఆరోన్ జోన్స్ మరోసారి అదరగొట్టాడు. నితీశ్ కుమార్(14)తో కీలక ఇన్నింగ్స్ ఆడిన జోన్స్ పాక్‌కు ముచ్చెమటలు పట్టించాడు. ఆఖరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. వీరిద్దరూ 14 పరుగులు రాబట్టడంతో స్కోర్లు సమమయ్యాయి.
అంతకుముందు అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. పవర్ ప్లేలో ఆ జట్టుకు వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ రిజ్వాన్(9), ఉస్మాన్ ఖాన్(3), ఫకర్ జమాన్(11) చేతులెత్తేయడంతో పాక్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజామ్(44), షాదాబ్ ఖాన్(40) ఇన్నింగ్స్ నిర్మించారు. బాబర్ నిదానంగా ఆడగా.. షాదాబ్ ఖాన్ ధాటిగా ఆడాడు. ఈ జోడీ మూడో నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. అయితే, కెంజిగె ఒకే ఓవర్‌లో షాదాబ్‌తోపాటు అజమ్ ఖాన్(0)ను అవుట్ చేయడంతో పాక్ ఇబ్బందుల్లో పడింది. కాసేపటికే బాబర్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది(23 నాటౌట్) కీలక పరుగులు జోడించడంతో పాక్ కష్టంగా పోరాడే స్కోరు సాధించింది. అమెరికా బౌలర్లలో నోస్తుష్ కెంజిగె 3 వికెట్లు, నేత్రవల్కర్ 2 వికెట్లతో సత్తాచాటారు. (ఏజెన్సీలు)