हैदराबाद : टी20 विश्व कप 2024 में शनिवार को भारत और कनाडा के बीच खेला जाएगा। भारतीय टीम सुपर 8 में पहले से ही जगह बना चुकी है। यह मैच भारतीय समयानुसार रात आठ बजे से खेला जाएगा। इस मैच का सीधा प्रसारण स्टारस्पोर्ट्स और हॉटस्टार पर देखा जा सकता है। वहीं कनाडा की टीम टूर्नामेंट में अपनी दूसरी जीत की तलाश में है। भारतीय टीम ने अपने पहले तीन मैचों में अपने टीम में कोई भी बदलाव नहीं किया था। इस मैच में वह अपनी बेंच स्ट्रेंथ को टेस्ट करने का प्रयास कर सकती है। साथ ही भारतीय टीम चाहेगी कि विराट कोहली अपनी लय में वापस लौट आये।
गौरतलब है कि टी20 क्रिकेट में भारत और कनाडा के बीच अभी तक एक भी मैच नहीं खेला गया है। यही पहली बार होगा, जब दोनों टीमें टी20 में एक-दूसरे के आमने सामने होगी। इस विश्व कप में अपने पहले तीन मैचों के जीतने के बाद भारतीय टीम एक बेहतरीन लय में है। अब उनका प्रयास इस मैच को भी जीतना है। भारत ने इससे पहले बांग्लादेश के खिलाफ खेले गए अभ्यास मैच में भी जीत हासिल की थी। इसके अलावा भारत ने विश्व कप से पहले अफ़ग़ानिस्तान के साथ टी20 सीरीज़ खेला था, जिसमें उन्हें जीत हासिल हुई थी।
वहीं कनाडा इस विश्व कप में आयरलैंड के ख़िलाफ़ एक बड़ा उलटफेर करने में सफल रहा, लेकिन इसके अलावा अभी तक उन्हें और कोई जीत नहीं मिली है। कनाडा को पहले मैच में USA से हार झेलनी पड़ी थी। उसके बाद पाकिस्तान के सामने भी उसे हराया दिया था।
यह भी पढ़ें-
विराट कोहली का बल्ला भले ही अभी तक इस विश्व कप में नहीं चला है। हालांकि, विपक्षी टीम इसे तूफ़ान से पहले की शांति से होगी। कोहली ने टी20 विश्व कप में 1146 रन बनाए हैं और उनका औसत 67.41 का रहा है। अगर वह फिर से इसी लय को प्राप्त करने में सफल रहे तो विपाक्षी टीमों के लिए खतरा बन सकते हैं।
वहीं अगर कनाडा की बात करें तो कनाडा के लिए ऐरन जॉनसन और कप्तान साद बिन ज़फ़र महत्वपूर्ण साबित हो सकते हैं। जॉनसन ने 2022 टी20 विश्व कप के बाद से कनाडा के लिए सभी 16 टी20आई खेलते हुए 51 की औसत और 166 के स्ट्राइक रेट से दो शतकों और पांच अर्धशतकों के साथ 713 रन बना चुके हैं। वहीं बिन ज़फ़र का टी20आई इकॉनमी रेट सिर्फ़ 6.39 का है और वह 19 की शानदार औसत से 37 मैचों में 43 विकेट ले चुके हैं। पिछले कुछ दिनों से फ्लोरिडा में मौसम खराब है। भारी बारिश से वहां बाढ़ जैसे हालात उत्पन्न हो गए हैं। ऐसे में मैच खेले जाने के चांस कम हैं। (एजेंसिया)
T20 World Cup 2024 : నేడు కెనడాతో భారత్ మ్యాచ్
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా చివరి లీగ్ దశ మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు కెనడాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్, ఆ తర్వాత పాకిస్థాన్, మూడో మ్యాచ్‌లో యూఎస్‌ఏను ఓడించిన భారత్.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో సూపర్-8కు అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే సూపర్-8కు చేరిన భారత్ ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది.
అయితే ఈ మ్యాచ్ ఫలితంపై పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు. కానీ ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీపై అందరి కళ్లూ ఉన్నాయి. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ తిరిగి ఫామ్ అందుకుంటే కీలకమైన సూపర్-8కు ముందు భారత జట్టుకు పట్టుకున్న బెంగ తీరిపోతుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా న్యూయార్క్‌లోనే జరిగాయి. కానీ ఇవాళ్టి మ్యాచ్‌ను ఫ్లోరిడాలో ఆడబోతోంది. కీలకమైన సూపర్-8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా ఉంది. కాగా భారత జట్టు ఓ టీ20 మ్యాచ్‌లో కెనడాతో తలపడనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు జరిగిన ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ అదిరే ప్రదర్శన చేశాడు. లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ గత మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఈ తరహా పరిస్థితుల నుంచి బయటపడటం కోహ్లీకి కొత్త కాదు. ఈ సారి కూడా అదే విధంగా పుంజుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రోహిత్‌తో కలిసి అతను జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందిస్తే కీలకమైన సూపర్-8కు ముందు అది జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనడంలో డౌట్ లేదు.
కాగా బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబెలు రాణిస్తున్నారు. ఐర్లాండ్‌పై రోహిత్, అమెరికాపై సూర్య కీలక హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై పంత్ వరుసగా 36, 42 పరుగులు స్కోరు చేశాడు. అమెరికాతో మ్యాచ్‌లో దూబె కూడా లయ అందుకున్నాడు. ఇక బౌలింగ్‌లోనూ బుమ్రా నేతృత్వంలోని పేస్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు బుమ్రా 5 వికెట్లు, అర్షదీప్ సింగ్ 7, హార్దిక్ పాండ్యా 7 వికెట్లతో సత్తాచాటారు. సిరాజ్ మాత్రం ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడని స్పెషలిస్టు స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లలో ఒకరిని లేదా ఇద్దరినీ ఈ మ్యాచ్‌లో ఆడించొచ్చు. సూపర్- 8 మ్యాచ్‌లు జరిగే విండీస్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టే.. కెనడాపై ఈ స్పిన్నర్లను పరీక్షించే ఛాన్స్ ఉంది.
మ్యాచ్ జరిగే ఫ్లోరిడాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. తుపాను ప్రభావంతో మ్యాచ్ జరిగే లాడర్‌హిల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియామిని ఇటీవల వరదలు ముంచెత్తాయి. మ్యాచ్ జరిగే బ్రోవార్డ్ కౌంటీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగేంజుకు 86% అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఇక్కడ జరగాల్సిన నేపాల్, శ్రీలంక, శుక్రవారం జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్‌లు కూడా రద్దు అయ్యాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. (ఏజెన్సీలు)