हैदराबाद: ब्रह्माकुमारीज़ के नेतृत्व में “शांति एवं सद्भाव को बढ़ावा देने हेतु जनसंपर्क” विषय पर राज्य स्तरीय संगोष्ठी का आयोजन किया जा रहा है। इस महीने की 20 तारीख को सुबह 10 बजे बीबीनगर के निकट साइलेंस रिट्रीट सेंटर में आयोजित होने वाले इस कार्यक्रम में राष्ट्रीय जनसंपर्क विशेषज्ञ भाग ले रहे हैं।
इस संगोष्ठी में तेलंगाना राज्य के राजस्व, आवास एवं सूचना मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी इस सम्मेलन में मुख्य अतिथि होंगे, जबकि तेलंगाना मीडिया अकादमी के अध्यक्ष के. श्रीनिवास रेड्डी, हैदराबाद प्रेस क्लब के अध्यक्ष एल. वेणुगोपाल नायडू और पब्लिक रिलेशंस सोसाइटी ऑफ इंडिया के राष्ट्रीय अध्यक्ष डॉ. अजीत पाठक विशिष्ट अतिथि होंगे।
इनके अलावा दोनों तेलुगु राज्यों और नगरद्वय से बड़ी संख्या में मीडिया और जनसंपर्क प्रतिनिधि भाग ले रहे हैं। ब्रह्माकुमारीज़ मीडिया विंग की उपाध्यक्ष बी. के. सरला ने बताया कि जनसंपर्क, कॉर्पोरेट संचार, मीडिया, पत्रकारिता, विज्ञापन और अन्य क्षेत्रों के कर्मचारी और छात्र भी इस सम्मेलन में भाग ले सकते हैं।
सरला ने यह भी कहा कि यह विशेष सम्मेलन इस दृष्टिकोण से आयोजित किया जा रहा है कि जनसंपर्क क्षेत्र सामाजिक संगठनों, व्यवस्थाओं और व्यक्तियों के बीच बेहतर समझ, एकता और सद्भाव को बढ़ावा देकर देश के विकास का मार्ग प्रशस्त कर सके।
उन्होंने बताया कि जनसंपर्क पेशेवर समाज के विभिन्न क्षेत्रों और समुदायों के बीच मैत्रीपूर्ण वातावरण बनाने और शांति स्थापित करने में महत्वपूर्ण भूमिका निभा सकते हैं और यह सम्मेलन उनके व्यावसायिक कौशल को निखारने में उपयोगी साबित होगा।
सरला आगे बताया गया कि सम्मेलन में भाग लेने वालों के लिए 20 जुलाई को सुबह 7.30 बजे सोमाजीगुडा प्रेस क्लब और सिकंदराबाद बुद्ध भवन से विशेष बस सेवा की व्यवस्था की गई है।
साइलेंस रिट्रीट सेंटर की निदेशक बी. के. राजा कुमारी और बी. के. सुनीता ने बताया कि जनसंपर्क, मीडिया, कॉर्पोरेट संचार और अन्य क्षेत्रों के कर्मचारियों, छात्रों और शिक्षकों को इस अवसर का लाभ उठाना चाहिए। अधिक जानकारी के लिए- 9848812031, 6301529398, 9030842132 पर इच्छुक व्यक्ति संपर्क कर सकते हैं।
Also Read-
బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో పబ్లిక్ రిలేషన్ పై రాష్ట్ర స్థాయి సదస్సు
హైదరాబాద్: బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో “శాంతి సామరస్యత పెంపు కోసం పబ్లిక్ రిలేషన్స్” అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. బీబీనగర్ సమీపంలోని సైలెన్స్ రిట్రీట్ సెంటర్ లో ఈ నెల 20న ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ ప్రజా సంబంధ నిపుణులు హాజరవుతున్నారు.
సదస్సులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రత్యేక అతిథులుగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల నాయుడు, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డా. అజిత్ పాఠక్ విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు, జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో మీడియా మరియు పీఆర్ రంగాల అభ్యర్థులు పాల్గొంటున్నారు. పబ్లిక్ రిలేషన్స్ తో పాటు కార్పొరేట్ కమ్యూనికేషన్స్, మీడియా, జర్నలిజం, అడ్వర్టైజింగ్ తదితర రంగాల ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఈ సదస్సులో పాల్గొనవచ్చని బ్రహ్మాకుమారీస్ మీడియా వింగ్ వైస్ చైర్ పర్సన్ బి. కె. సరళ తెలిపారు.
సామాజిక సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తుల మధ్య మెరుగైన అవగాహన, ఐక్యత, సామరస్యతలను పెంపొందించడం ద్వారా పీఆర్ రంగం దేశ అభివృద్ధికి బాటలు వేయగలదనే దృక్పథంతో ఈ ప్రత్యేక సదస్సుని నిర్వహిస్తున్నామని చెప్పారు.
సమాజంలోని విభిన్న రంగాలు, వివిధ వర్గాల మధ్య మధ్య స్నేహపూర్వక వాతావరణం సృష్టించి శాంతిని నెలకొల్పటంలో పీఆర్ నిపుణులు కీలక పాత్ర పోషించగలరని, వారికి వృత్తి నైపుణ్యం పెంచేందుకు ఈ సదస్సు చక్కగా ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.
సదస్సుకి హాజరయ్యే వారి కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, సికింద్రాబాద్ బుద్ధ భవన్ నుంచి జులై 20న ఉదయం ఏడున్నరకు ప్రత్యేక బస్సు సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పీఆర్ తో పాటు మీడియా, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ తదితర రంగాల ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్లు బి. కె. రాజ కుమారి, బి. కె. సునీత వివరించారు. మరిన్ని వివరాలకు – 9848812031, 6301529398, 9030842132 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
