हैदराबाद: रविवार को बीबीनगर के निकट ब्रह्माकुमारीज़ साइलेंस रिट्रीट सेंटर में जनसंपर्क पर एक राज्य स्तरीय सम्मेलन आयोजित किया गया। इस अवसर पर वक्ताओं ने समाज के विभिन्न वर्गों के बीच एकता और विश्वास बढ़ने पर ही शांतिपूर्ण विकास का संभव होने की बात पर बल दिया। उन्होंने जाति और धर्म से ऊपर उठकर सामाजिक एकता बढ़ाने के लिए ब्रह्माकुमारीज़ द्वारा किए जा रहे कार्यों की भूरि-भूरि प्रशंसा की। ग्लोबल पब्लिक रिलेशंस फ़ोरम और ब्रह्माकुमारीज़ के संयुक्त तत्वावधान में “शांति, एकता और विश्वास के लिए जनसंपर्क” विषय पर संगोष्ठी का सफल आयोजन किया गया।

पब्लिक रिलेशंस सोसाइटी ऑफ़ इंडिया के राष्ट्रीय अध्यक्ष और कार्यक्रम के मुख्य अतिथि डॉ. अजीत पाठक ने कहा कि जब देशों के बीच, समाज के विभिन्न वर्गों के बीच और परिवार के व्यक्तियों के बीच विश्वास की कमी होती है, तो अशांति पैदा होती है और ऐसे समय में यदि आध्यात्मिकता के माध्यम से सकारात्मकता बढ़ाई जाए, तो शांति और सद्भाव कायम हो जाएगा। पाठक ने आगे कहा कि यदि जनसंपर्क प्रतिनिधियों में नैतिकता और विश्वास होगा, तो वे अपने पेशे में उत्कृष्टता प्राप्त कर सकेंगे। उन्होंने यह भी कहा कि भारतीय पब्लिक रिलेशंस सोसायटी सम्पूर्ण विश्व को वसुधैव कुटुम्बकम् की अवधारणा के साथ कार्य करती है और यह सराहनीय है कि ब्रह्माकुमारीज भी इसी लक्ष्य की दिशा में कार्य कर रही है।

सम्मेलन की अध्यक्षता करते हुए ब्रह्माकुमारीज़ मीडिया विंग की उपाध्यक्ष बी. के. सरला ने कहा कि यदि जनसंपर्क प्रतिनिधि अपने पेशे में आध्यात्मिक और नैतिक मूल्यों को शामिल करें, तो समाज में एकता, सद्भाव और शांति का विकास होगा। उन्होंने यह भी कहा कि सरकारी या निजी संगठनों में सभी विभागों के बीच प्रेमपूर्ण संबंध स्थापित करने में जनसंपर्क प्रतिनिधि महत्वपूर्ण भूमिका निभाते हैं और जब वे व्यक्तिगत स्तर पर शांत होते हैं, तभी वे संगठन में भी शांतिपूर्ण विकास देख सकते हैं। उन्होंने सुझाव दिया कि ब्रह्माकुमारीज़ पूरे विश्व में राजयोग प्रशिक्षण के माध्यम से प्रत्यक्ष शांति-निर्माण सेवाएँ प्रदान कर रही है और सभी को इनका लाभ उठाना चाहिए।

पब्लिक रिलेशंस वॉयस के संपादक वाई. बाबजी ने कहा कि तकनीक और कृत्रिम बुद्धिमत्ता के कारण मानवीय रिश्तों के कम होते दौर में जन-संपर्क प्रतिनिधियों की ज़िम्मेदारी है कि वे समाज में व्यक्तियों और संस्थाओं के बीच शांति को बढ़ावा दें। उन्होंने कहा कि ब्रह्माकुमारीज़ द्वारा सिखाया गया राजयोग ध्यान, पेशे में आने वाली सभी प्रकार की चुनौतियों का समाधान करने में दक्षता बढ़ाता है और आध्यात्मिक क्षेत्र में ब्रह्माकुमारीज़ की सेवाएँ प्रशंसनीय हैं।

भारतीय प्रेस परिषद के पूर्व सदस्य लक्ष्मण ने युद्धग्रस्त देशों में भी शांति को बढ़ावा देने के लिए ब्रह्माकुमारीज़ की सेवाओं की प्रशंसा की। उन्होंने कहा कि ब्रह्माकुमारीज़ का प्रशिक्षण मीडिया और जन-संपर्क क्षेत्र के लोगों के लिए बहुत मददगार है, जो लगातार दबाव में रहते हैं।

ब्रह्माकुमारीज़ मीडिया विंग की अध्यक्ष राजयोगी बी. के. करुणा भाई ने माउंट आबू से ऑनलाइन संबोधन में कहा कि ऐसे समय में जब समाज में चुनौतियाँ और जटिलताएँ बढ़ रही हैं, तो शांति और सद्भाव बनाए रखना जनसंपर्क क्षेत्र की महत्वपूर्ण ज़िम्मेदारी है। साइलेंस रिट्रीट सेंटर की निदेशक बी. के. राजकुमारी ने व्यावहारिक ध्यान का अनुभव कराया, जबकि बी. के. सुनीता ने सुझाव दिया कि जनसंपर्क अधिकारी (पीआरओ) स्वयं को सकारात्मकता या परमात्मा संबंध अधिकारी मानकर शांति को बढ़ावा दे सकते हैं।

इस अवसर पर डॉ. अजीत पाठक और डॉ. बाबजी याना को गोल्डन ट्रायंगल पुरस्कार से सम्मानित किया गया। कार्यक्रम में हिंदी मिलाप के विज्ञापन विभाग प्रबंधक प्रकाश जैन, पीआरएसआई हैदराबाद के अध्यक्ष डॉ. गिरि, तेलंगाना ऑफसेट प्रिंटर्स के अध्यक्ष रविंदर रेड्डी, अनिंदिता मुखर्जी, बी. के. निर्मला और अन्य लोगों ने भाग लिया। इस सम्मेलन में दोनों तेलुगु राज्यों और नगरद्वय से बड़ी संख्या में जनसंपर्क प्रतिनिधियों ने भाग लिया।
Also Read-
సామాజిక ఐక్యతకు బ్రహ్మాకుమారీల కృషి చాలా గొప్పది
హైదరాబాద్: సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత, విశ్వసనీయత పెరిగినప్పుడే శాంతిపూర్వకమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వక్తలు పిలుపునిచ్చారు. సామాజిక ఐక్యతను పెంచడానికి బ్రహ్మా కుమారీలు కుల మతాలకు అతీతంగా చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆదివారం బీబీనగర్ సమీపంలోని బ్రహ్మా కుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో పబ్లిక్ రిలేషన్స్ మీద రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. గ్లోబల్ పబ్లిక్ రిలేషన్స్ ఫోరం, బ్రహ్మా కుమారిస్ సంయుక్త ఆధ్వర్యంలో “ శాంతి, ఐక్యత, విశ్వసనీయత కోసం పబ్లిక్ రిలేషన్స్” అంశం మీద సెమినార్ నిర్వహించారు.

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల మధ్య, సమాజంలోని వర్గాల మధ్య, కుటుంబంలోని వ్యక్తుల మధ్య విశ్వసనీయత లోపించినప్పుడు అశాంతి ఏర్పడుతుందని, ఇలాంటి తరుణంలో ఆధ్యాత్మికత ద్వారా పాజిటివిటీని పెంచితే శాంతి, సామరస్యత నెలకొంటాయని అన్నారు. పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధుల్లో నైతికత, విశ్వసనీయత ఉన్నప్పుడు వృత్తి లో రాణించగలుగుతారని పాఠక్ చెప్పారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రపంచం మొత్తం వసుదైవ కుటుంబం అనే భావనతోనే పని చేస్తోందని, బ్రహ్మాకుమారీలు కూడా ఇదే లక్ష్యంతో కృషి చేస్తుండటం అభినందనీయమని అన్నారు.

సదస్సుకు నేతృత్వం వహించిన బ్రహ్మా కుమారిస్ మీడియా వింగ్ వైస్ చైర్ పర్సన్ బి. కె. సరళ మాట్లాడుతూ పీఆర్ ప్రతినిధులు వృత్తిలో ఆధ్యాత్మిక, నైతిక విలువలను జోడించినట్లయితే సమాజంలో ఐక్యత, సామరస్యత ప్రశాంతత వృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లోని అన్ని విభాగాల మధ్య ప్రేమపూర్వక సంబంధాలను నెలకొల్పటంలో పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారని,వీరు వ్యక్తిగత స్థాయిలో శాంతిని కలిగి ఉన్నప్పుడే సంస్థలో కూడా శాంతిపూర్వకమైన అభివృద్ధిని చూడగలుగుతారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రాజయోగ శిక్షణ ద్వారా బ్రహ్మాకుమారీస్ ప్రత్యక్షంగా శాంతిని నెలకొల్పే సేవలు అందిస్తున్నారని, అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ సంపాదకుడు వై.బాబ్జి మాట్లాడుతూ టెక్నాలజీ, కృత్రిమ మేథ కారణంగా మానవ సంబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో సమాజంలోని వ్యక్తుల్లో, వ్యవస్థల్లో శాంతిని పెంపొందించే బాధ్యత పీఆర్ ప్రతినిధుల పై ఉందన్నారు. బ్రహ్మాకుమారీలు నేర్పే రాజయోగ ధ్యానం వృత్తిలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను పరిష్కరించే సమర్థతను పెంచుతుందని, ఆధ్యాత్మిక రంగంలో బ్రహ్మా కుమారీల సేవలు సాటిలేనివని చెప్పారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా బ్రహ్మా కుమారీస్ శాంతిని పెంచే సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిరంతరం ఒత్తిడితో నిండిన మీడియా, పీఆర్ రంగంలోని వ్యక్తులకు బ్రహ్మాకుమారీల శిక్షణ అద్భుతంగా సహాయపడుతుందని చెప్పారు.
సమాజంలో సవాళ్లు, సంక్లిష్టతలు పెరుగుతున్న తరుణంలో శాంతి సామరస్యతలను కాపాడే కీలకమైన బాధ్యత పీఆర్ రంగంపై ఉందని బ్రహ్మా కుమారిస్ మీడియా వింగ్ చైర్మన్ రాజయోగి బి. కె. కరుణా భాయ్ మౌంట్ అబూ నుంచి ఆన్ లైన్ ద్వారా మాట్లాడారు. సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్లు బి. కె. రాజకుమారీ ప్రాక్టికల్ ధ్యానం అనుభూతి చేయించగా, బి.కె. సునీత పీ.ఆర్.ఓలు పాజిటివిటీ లేదా పరమాత్మ రిలేషన్ ఆఫీసర్స్ గా భావించుకుంటే శాంతిని పెంపొందించగలరని సూచించారు.
పీఆర్ రంగంలో అత్యుత్తమ సేవలకుగాను బ్రహ్మా కుమారీస్ అందించే గోల్డెన్ ట్రయాంగిల్ పురస్కారాలను అజిత్ పాఠక్, బాబ్జి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందీ మిలాప్ అడ్వర్టైజింగ్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ ప్రకాష్ జైన్, పీఆర్ఎస్ఐ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ గిరి, తెలంగాణ అఫ్ సెట్ ప్రింటర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, అనిందిత ముఖర్జీ, బి. కె. నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలు, జంట నగరాల నుంచి పీఆర్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
