हैदराबाद: अपनी पत्नी और ससुराल वालों को मारने की कोशिश करने वाले शख्स को नारायणखेड़ पुलिस ने गिरफ्तार किया है। नारायणखेड़ सीआई रामकृष्ण रेड्डी और एसआई वेंकट रेड्डी ने बताया कि गोल्ला रमेश ने अपनी पत्नी को दो साल से ससुराल नहीं भेजा था और उसने अपनी पत्नी और ससुराल वालों को मारने की साजिश रची।
गोला रमेश की पत्नी पति से झगड़ा कर दो साल से अपने माता-पिता के साथ संजीवनरावपेट में रह रही है। तभी से रमेश इस बात से नाराज है कि वह अपनी पत्नी को ससुराल नहीं भेज रहा है। इससे उसने अपनी पत्नी और ससुराल वालों को मारने की योजना बनाई। इसी महीने की 12 तारीख को संजीवनरावपेट गांव में यानी अपने मामा रामुलु के घर के दरवाजे पर लोहे की तार लगवा दी और करंट कनेक्शन दे दिया।
उस दिन बिजली नहीं होने के कारण योजना सफल नहीं हुई। इसके बाद उसने खेत के पास जाकर दो बोर की मोटर जला दी। उसने पत्थर फेंके और उसे नष्ट कर दिये। जांच में पता चला कि रमेश ने यह सब किया और सोमवार को मामला दर्ज कर उसे जेल भेज दिया गया।
భార్య మరియు అత్తమామల హత్యకు ప్లాన్, అల్లుడు అరెస్టు
హైదరాబాద్ : భార్యతో పాటు అత్తమామలను చంపేందుకు యత్నించిన ఒకరిని నారాయణఖేడ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేండ్లుగా తన భార్యను కాపురానికి పంపడం లేదని గొల్ల రమేశ్ తన భార్యను, అత్తమామలను చంపడానికి కుట్ర పన్నాడని నారాయణఖేడ్ సీఐ రామకృష్ణరెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి చెప్పారు.
గొల్ల రమేశ్ భార్య తన భర్తతో గొడవపడి రెండేండ్లుగా తల్లిదండ్రులతో కలిసి సంజీవన్ రావుపేటలో ఉంటోంది. అప్పటి నుంచి భార్యను కాపురానికి పంపడం లేదని రమేశ్ కోపంతో ఉన్నాడు. దీంతో భార్యతో సహా అత్తమామలను చంపాలని ప్లాన్ వేశాడు. ఈనెల 12న సంజీవన్ రావుపేటలోని మామ రాములు ఇంటి తలుపులకు ఇనుపతీగ అమర్చి కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు.
కరెంట్ లేక పథకం పారలేదు. తర్వాత పొలం దగ్గరికి వెళ్లి రెండు బోర్ మోటర్లను కాలబెట్టాడు. బోరులో రాళ్లు వేసి ధ్వంసం చేశాడు. విచారణలో ఇదంతా చేసింది రమేశ్ అని తేలడంతో సోమవారం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. (ఏజెన్సీలు)