हैदराबाद : तेलंगाना सरकार ने 10वीं परीक्षा के आयोजन पर अहम फैसला लिया है। शिक्षा विभाग ने इस शैक्षणिक वर्ष में भी 11 पेपर की बदले केवल 6 पेपर के साथ परीक्षा आयोजित करने फैसला लिया है। इस प्रस्ताव को सरकार ने मंजूरी भी दे दी है।
मालूम हो कि सरकार ने कोरोना महामारी के कारण 2021 में 11 पेपर के परीक्षा के बजाये 6 पेपर तक कम करते हुए फैसला किया था। हालांकि, उस साल कोरोना प्रकोप के कारण परीक्षा का आयोजित करना संभव नहीं हुआ था। हालांकि 2022 में शिक्षा विभाग ने दसवीं की परीक्षा आयोजित की। 2022 में 6 पेपर के साथ परीक्षा आयोजित की गई। ताजा तेलंगाना सरकार ने 2023 में केवल 6 पेपरों के साथ परीक्षा आयोजित करने की अनुमति दी है।
पहले तेलुगु, अंग्रेजी, गणित, सामान्य विज्ञान और सामाजिक विज्ञान विषयों को दो पेपर के साथ आयोजित किया जाता था। हिंदी विषय को एकल परीक्षा आयोजित की जाती थी। कोरोना के चलते 11 पेपर की जगह 6 पेपर कर दिया गया है।
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా 2021లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఏడాది కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించడం వీలు కాలేదు. ఇక 2022లో విద్యాశాఖ టెన్త్ పరీక్షలు నిర్వహించింది. అప్పుడు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు.
మళ్లీ తాజాగా 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.గతంలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా నిర్వహించేవారు. ఇక హిందీ సబ్జెక్ట్‌కు ఒకే పరీక్ష నిర్వహించేవారు. కరోనా కారణంగా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే కుదించారు. (एजेंसियां)