हैदराबाद : बंटवारे (विभाजन) के वादों और जल संसाधनों के दोहन के खिलाफ टीजेएस के नेतृत्व में सोमवार को दिल्ली के जंतर-मंतर पर मौन दीक्षा (धरना) कार्यक्रम किया जाएगा। साथ ही मंगलवार को कांस्टीट्यूशनल क्लब में केसीआर के शासन पर सेमिनार होगा।
टीजेएस के अध्यक्ष प्रोफेसर कोदंडराम ने रविवार को दिल्ली के तेलंगाना भवन में मीडिया से यह जानकारी दी। उन्होंने आगे कहा कि जल और अन्य मुद्दों के अलावा तेलंगाना के साथ हो रहे अन्याय पर 150 लोग एक घंटे के मौन धरना कार्यक्रम में भाग लेंगे। उन्होंने बताया कि योगेंद्र यादव और विभिन्न राज्यों के प्रमुख नेता केसीआर के शासन और तेलंगाना के साथ हो रहे अन्याय पर अपने विचार व्यक्त करेंगे।
कोदंडराम ने दिल्ली में रह रहे तेलंगाना के लोगों से उनके आंदोलन का समर्थन करने की अपील की। तेलंगाना गठन के बाद भी जल बंटवार को लेकर में अन्याय हो रहा है। तेलंगाना को कृष्णा जल का केवल 22 फीसदी हिस्सा मिला रहा है। इसके चलते लंबित परियोजनाओं को पूरा नहीं किया जा सकता है। चूंकि उनके पास जल आवंटन नहीं है इसलिए परमिट नहीं मिल रहा है। नतीजतन 28 लाख एकड़ को पानी नहीं मिल रहा है।
టీజేఎస్ : ఢిల్లీలో మౌన దీక్ష
హైదరాబాద్ : విభజన హామీలు, జల వనరుల దోపిడీపై టీజేఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నారు. మంగళవారం కానిస్టిట్యూషనల్ క్లబ్ లో కేసీఆర్ పాలనపై సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలపై టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
నీళ్ల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఇతర అంశాలపై 150 మందితో గంట పాటు మౌన దీక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. సెమినార్ లో యోగేంద్ర యాదవ్ తో పాటు వివిధ రాష్ట్రాల కీలక నేతలు పాల్గొని కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ వచ్చాక కూడా నీళ్ల వాటాలో అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో 22% వాటా మాత్రమే తెలంగాణకు దక్కింది. ఈ వాటాతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం సాధ్యం కాదు. వాటికి నీటి కేటాయింపులు లేకపోవడంతో అనుమతులు రావట్లేదు. దీంతో 28 లక్షల ఎకరాలకు నీళ్లు అందట్లేదదు” అని కోదండరాం చెప్పారు. (ఏజెన్సీలు)