हैदराबाद : छत्तीसगढ़ के बीजापुर जिले में बर्बरता से हुई पत्रकार मुकेश चंद्राकर की पोस्टमार्टम रिपोर्ट में दिल दहलाने वाला खुलासा हुआ है। पत्रकार की पोस्टमार्टम रिपोर्ट में सामने आया है कि उसे बेरहमी से मारा गया।
आरोपी ठेकेदार सुरेश चंद्राकर
मुकेश को खौफनाक तरीके से मौत के घाट उतारा गया। मौत से पहले उसे भयंकर यातनाएं दी गईं। मुकेश की पोस्टमार्टम रिपोर्ट में खुलासा हुआ है कि लीवर के चार टुकड़े कर दिये गये। उसकी पांच पसलियां और गर्दन की हड्डी तोड़ दी गई। इसके अलावा उसके हाथ की हड्डी दो टुकड़े किये गये। हार्ट पूरी तरह से सुरक्षित पाया गया है। सिर पर चोट के 15 गंभीर निशान पाए गए हैं।
पोस्टमार्टम करने वाले डॉक्टर ने कहा कि मैंने अपने 12 साल के कॅरियर में ऐसा मामला पहले कभी नहीं देखा। मुकेश की हत्या बेहद बेरहमी से की गई है। गौरतलब है कि पत्रकार मुकेश चंद्राकर करने के बाद ठेकेदार सुरेश चंद्राकर ने शव को सेप्टिंक टैंक में डाल दिया था।
यह भी पढ़ें-
జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ హత్య కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ పోస్ట్ మార్టమ్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతడిని హంతకులు అత్యంత కిరాతకంగా చంపినట్లు తేలింది. తలపై 15 ఫ్రాక్చర్లు ఉన్నట్లు గుర్తించారు.
మెడ విరిగిపోయినట్లు నివేదికలో తేలింది. దీంతో పాటు అతడి గుండెను హంతకులు చీల్చివేశారు. లివర్‌ను నాలుగు బాగాలుగా కోసినట్లు తేలింది. ఐదు పక్కటెముకలతో పాటు మెడ భాగంలో ఎముకలు విరిగిపోయినట్లు గుర్తించారు. చేతి ఎముక ఫ్రాక్చర్ కాగా గుండెకు లోతుగా గాయమైనట్లు పోస్ట్ మార్టమ్ నివేదికలో తేలింది. తమ 12 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు.
రూ.120 కోట్ల కాంట్రాక్టులో అవినీతిని ఆయన బయటపెట్టినందుకు ఆయన హత్యకు గురైన విషయం తెలిసిందే. జనవరి 3న ముఖేష్ డెడ్ బాడీ సురేష్ చంద్రకార్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైంది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకార్ పరారీలో ఉన్నాడు. (ఏజెన్సీలు)