हैदराबाद: दिल्ली शराब घोटाले में गिरफ्तार रामचंद्र पिल्लई की रिमांड रिपोर्ट में सनसनीखेज बातें सामने आई हैं। ईडी ने 17 पेज की रिमांड रिपोर्ट तैयार की है। ईडी ने कहा कि पिल्लै एमएलसी कविता के लिए बेनामी हैं। रिमांड रिपोर्ट में आगे कहा गया है कि पिल्लई ने कविता के हितों के लिए काम किया है और उसने कई बार बयान दिए हैं कि वह कविता का प्रतिनिधि है। ईडी ने यह भी कहा कि पिल्लई ने शराब घोटाले में अहम भूमिका निभाई और वह इंडो स्पिरिट की स्थापना में अहम भूमिका भी रही है।
दिल्ली शराब घोटाले में गिरफ्तार किए गए रामचंद्र पिल्लई को ईडी के अधिकारियों ने दिल्ली के राउज एवेन्यू कोर्ट में पेश किया। ईडी ने हिरासत देने के लिए एक याचिका दायर की है क्योंकि इन लेनदेन से संबंधित अधिक विवरण प्राप्त करना आवश्यक है कि रामचंद्र पिल्लई ने समीर महेंद्र के साथ दिल्ली शराब घोटाले में महत्वपूर्ण भूमिका निभाई जो इस मामले में एक अन्य आरोपी है। अधिकारियों की याचिका से सहमत होकर, अदालत ने रामचंद्र पिल्लई को सात दिनों के लिए रिमांड पर लेने की अनुमति दी।
इसके चलते पिल्लै अब 13 मार्च तक ईडी की हिरासत में रहेंगे। अदालत ने उसे हिरासत में रहते हुए अपनी मां से फोन पर बात करने की अनुमति दी है। सात ही उसकी पत्नी और देवर से रोज मिलने की बात मानी है। कोर्ट ने साफ किया कि बीमार पिल्लै को हाइपोथायराइड की दवाएं और कमर दर्द के लिए बेल्ट का इस्तेमाल हिरासत में भी किया जा सकता है। कोर्ट ने ईडी के अधिकारियों को सिर्फ कैमरे के सामने ही पूछताछ करने का निर्देश दिया।
ఢిల్లీ లిక్కర్ స్కామ్ : పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 17 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ రూపొందించింది. పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఉన్నారని తెలిపింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై పనిచేశారని, తాను కవిత ప్రతినిధినని పిళ్లై పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చారని రిమాండ్ లో పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో పిళ్లై కీలకపాత్ర పోషించారని, ఇండో స్పిరిట్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అదికారులు. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. అధికారుల పిటీషన్ తో ఏకీభవించిన కోర్టు అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.
దీంతో ఆయన మార్చి 13వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కస్టడీలో ఉన్న సమయంలో తన తల్లితో ఫోన్ లో మాట్లాడేందుకు అనుతించింది కోర్టు. అదే విధంగా ప్రతి రోజూ తన భార్య, బావమరిదిని కలుసుకునేందుకు సైతం అంగీకరించింది న్యాయస్థానం. అనారోగ్యంతో బాధపడుతున్న పిళ్లైకు.. హైపో థెరాయిడ్ మందులు, వెన్ను నొప్పికి బెల్ట్ ను కస్టడీలోనూ ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది కోర్టు. కెమెరా ముందు మాత్రమే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆదేశించింది కోర్టు. (ఏజెన్సీలు)