हैदराबाद : हाल ही में तेलंगाना राज्य लोक सेवा आयोग (TSPSC) ने ग्रुप-1 से ग्रुप-4 तक कई और भर्तियां निकाली हैं। मुख्यमंत्री केसीआर द्वारा विधानसभा में 80 हजार नौकरियों की भर्ती की घोषणा के बाद से हर नियुक्ति को बड़ी सावधानी से किये जा रहे हैं। पहले ही कईं भर्ती परीक्षाएं बिना किसी समस्या के सफलतापूर्वक पूरी कर ली गई हैं।
लोक सेवा आयोग किसी भी तरह की गड़बड़ी से बचने के लिए उन्नत तकनीक का इस्तेमाल कर रहा है। हालांकि, हाल ही में हुई पेपर हैकिंग की घटना से आयोग और लाखों बेरोजगारों को गहरा झटका लगा है। आशंका जताई जा रही है कि क्या अब तक भर्ती परीक्षाओं से जुड़े पेपर भी लीक हुए हैं?
इस मामले में पुलिस द्वारा की जा रही जांच में सनसनीखेज बातें सामने आ रही हैं। पता चला है कि टीएसपीएससी के सचिव के अधीन काम करने वाले एक पीए और बोर्ड में कार्यरत एक अन्य आउटसोर्सिंग कर्मचारी द्वारा यह पेपर लीक किया गया। फिलहाल प्रवीण और राजशेखर यानी दो युवक पुलिस की हिरासत में हैं। अधिकारियों को संदेह है कि इन युवकों ने अधिकारियों की डायरी के पासवर्ड के आधार पर पेपर लीक किया।
चर्चा है कि एक युवती के जाल में फंसे प्रवीण ने पेपर लीक किया है। अधिकारियों ने पाया है कि युवती हाल ही में प्रवीण से मिलने के लिए बार-बार कार्यालय आती रही है। इस पृष्ठभूमि में प्रवीण ने पेपर लीक कर युवती को दे दिया। जब इसकी भनक एक अन्य युवक को तो उसने पुलिस को इस बार में सूचित किया और इस लीक मामले का खुलासा हुआ।
बताया जा रहा है कि सरकार ने इस मामले को गंभीरता से लिया है। पुलिस जांच के आधार पर ऐसी खबरें आ रही हैं कि टीएसपीएससी के मुख्य अधिकारियों के खिलाफ कड़ी कारवाई किये जाने की संभावना है। TSPSC Group-1 प्रीलिम्स परीक्षा पहले ही आयोजित की जा चुकी है और मुख्य तिथियों की भी घोषणा की जा चुकी है। टीएसपीएससी ने सहायक अभियंता आदि के लिए कई भर्ती परीक्षाएं भी आयोजित कीं है। लेकिन संदेह व्यक्त किया जा रहा है कि क्या इससे जुड़ा कोई पेपर लीक हुआ है?
टीएसपीएससी को ऐसे अनेक शंकाओं को भी दूर करने की जरूरत है। मालूम हो कि टीएसपीएससी ने कल बयान जारी कर कहा कि आज यानी इस महीने की 12 तारीख के साथ 15 और 16 तारीख को होने वाली सभी भर्ती परीक्षाएं हैकिंग के संदेह चलते स्थगित कर दी गई है।
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
హైదరాబాద్ : ఇటీవల గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు ఇంకా అనేక ఉద్యోగ నియామకాలను అత్యంత పకబ్భందీగా చేపట్టింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత ప్రతీ నియామకాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేక నియామక పరీక్షలను విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేసింది.
ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యున్నత సాంకేతికతను ఉపయోగించుకుంటోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే తాజాగా బయపటపడ్డ హ్యాకింగ్ వ్యవహారంతో కమిషన్ వర్గాలతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు జరిగిన నియామక పరీక్షలకు సంబంధించి కూడా పేపర్లు లీక్ అయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయంపై పోలీసులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రెటరీ దగ్గర పని చేసే పీఏతో పాటు బోర్డులో పని చేసే మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ లీకేజీకి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రవీణ్, రాజశేఖర్ అనే ఇద్దరు యువకులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆఫీసర్ల డైరీల్లో ఉన్న పాస్ వర్డ్ ల ఆధారంగా వీరే పేపర్లను లీక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే ప్రవీణ్ కు గాలం వేసిన ఓ యువతి పేపర్ ఇవ్వమని కోరడంతోనే అతను ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కోసం ఆ యువతి ఇటీవల తరచుగా ఆఫీస్ కు వస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పేపర్ ను లీక్ చేసి ఆ యువతికి అందించినట్లు తెలుస్తోంది, అయితే ఈ విషయం ఓ యువకుడికి తెలియడంతో అతను పోలీసులకు సమచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణ ఆధారంగా టీఎస్పీఎస్సీ ముఖ్యులపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి మెయిన్స్ తేదీలను సైతం ప్రకటించింది. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ తదితర అనేక నియామక పరీక్షలను సైతం నిర్వహించింది.
అయితే వీటికి సంబంధించి సైతం ఏమైనా పేపర్ లీక్ అయి ఉంటుందా? అన్న అనుమానాలను సైతం టీఎస్పీఎస్సీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. హ్యాకింగ్ జరిగిందని అనుమానంతో ఈ రోజు అంటే ఈ నెల 12వ తేదీతో పాటు 15,16 వ తేదీల్లో జరగాల్సిన అన్ని నియామక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ నిన్న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)