హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలందరు విభేధాలు పక్కన పెట్టాలని పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరితో సమావేశమయ్యానని అందరి అభిప్రాయాలు తీసుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి వేడుకుంటున్నాఏమైనా విబేధాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని కోరారు. కలిసికట్టుగా ఉంటేనే బీఆర్ఎస్, బీజేపీని ఓడించగలుగుతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ గీత దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. ఎంత పెద్దనేతలైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని చెప్పారు. అలా కాకుండా రోడ్డెక్కి రచ్చ చేసుకోవద్దని సూచించారు.ఇది మంచిది కాదని సలహా ఇచ్చారు.
Related News:
దిగ్విజయ్ సింగ్ ముఖ్యాంశాలు…
“భరత్ జోడీ యాత్రను సక్సెస్ చేసినందుకు టీకాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు. మోడీ హయాంలో ధరలు , నిరుద్యోగం పెరిగింది. ఈడీ, సిబిఐ, ఐటీ లతో వేదిస్తుంది కేంద్ర సర్కార్. దేశంలో విద్వేషాలను బీజేపీ పెంచుతోంది. భారత్ జోడో యాత్ర కు ఆదరణను చూసి .. యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కరోనా సాకుతో యాత్రను అడ్డుకునే కుట్ర చేస్తుంది. బిజేపి కార్యక్రమాలకు మాత్రం కరోనా అడ్డుకాదు. యేదెక్కడి న్యాయం. కాశ్మిర్ వరకు యాత్ర జరిగి తీరుతుంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు… మరిచారు. కేసీఆర్ … కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేస్తున్నారు. దేశంలో బిజేపి ఇదే చేస్తుంది. పార్లమెంట్ లో BRS… BJPని సమర్థిస్తుంది. బిఆర్ఎస్ – బిజేపి లోపాయకారి సంబంధం ఉంది. ఎంఐఎం… బిజేపి ని గెలిపించేందుకు పనిచేస్తుంది. ముస్లిం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది కాంగ్రెస్… ఓవైసీ గుర్తించుకోవాలి. కేసీఆర్ కు ఎందుకు ఎంఐఎం మద్దతు ఇస్తుందో ఓవైసీ చెప్పాలి?”