గుంతకల్లు డివిజన్‌లో గుంతకల్లు-బళ్లారి సెక్షన్ మధ్య భద్రతా తనిఖీని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ SCR Conducts Safety Inspection

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ 17 మార్చి న గుంతకల్లు డివిజన్లోని గుంతకల్లు-బళ్లారి సెక్షన్లో భద్రతా తనిఖీని నిర్వహించారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు గుంతకల్లు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్ర శేఖర్ గుప్తా మరియు డివిజన్ నుండి ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

జనరల్ మేనేజర్ గుంతకల్లు నుండి రియర్ విండో తనిఖీని ప్రారంభించి ఆ సెక్షన్ లోని రైల్వే ట్రాక్‌లు, వంపులు, లెవెల్ క్రాసింగ్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ మరియు వంతెనల భద్రతా అంశాలను పరిశీలించి, అధికారులతో వివిధ భద్రతా అంశాలపై చర్చించారు. ఈ తనిఖీ సమయంలో ఆ సెక్షన్ రద్దీ మరియు ట్రాక్ సాంద్రత గురించి ఆరా తీసి, రైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల గురించి చర్చించారు.

ఈ సంధర్భంగా జనరల్ మేనేజర్ రైల్వే ట్రాక్ ను నిర్వహణ పనుల కోసం తీసుకునే ముందు, నిర్వహణ సమయంలో రైళ్ల సమయపాలనను పాటించేలా చూసేందుకు గాను—ఇంజనీరింగ్, సిగ్నల్స్ మరియు ఆపరేషన్స్ వంటి సంబంధిత విభాగాలతో సమన్వయం ఏర్పర్చుకొని ముందస్తు ప్రణాళికను రూపొందించాలని ఆయన గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ ను ఆదేశించారు. ఈ తనిఖీలో అధికారులు ఆ సెక్షన్‌లోని కీలకమైన, సున్నితమైన ప్రాంతాలపై, అలాగే ట్రాక్‌ను పటిష్టం చేయడానికి మరియు సెక్షనల్ వేగాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న ప్రణాళికలపై జనరల్ మేనేజర్‌కు వివరంగా తెలియజేశారు.

జనరల్ మేనేజర్ రైలు కార్యకలాపాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను/సిబ్బందిని ఆదేశించారు. వేగపరిమితులను నిశితంగా పర్యవేక్షిస్తూ రైళ్లు సమయాను సారంగా సజావుగా నడిచేలా చూడాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

Also Read-

SCR Conducts Safety Inspection Between Guntakal-Bellari Section on Guntakal Division

Hyderabad: Sanjay Kumar Srivastava, General Manager, South Central Railway conducted Safety Inspection of the Guntakal – Ballari Section of Guntakal Division today. He was accompanied by Chandra Sekhar. Gupta, Divisional Railway Manager, Guntakal Division and other senior officials from division.

The General Manager commenced rear window inspection from Guntakal, wherein he examined the safety aspects of Railway Tracks, Curves, Level Crossings, Signalling System and Bridges in the section and discussed on the various safety aspects with the Officials. During inspection, he enquired on the density and track congestions of the section and discussed on operational challenges.

He instructed DRM, Guntakal to make advance plan with all the concerned departments such as engineering, signal and operations etc., before taking the track for maintenance works, so that the punctuality can be maintained during maintenance period. The officials detailed to the General Manager on critical and sensitive areas of the section and also on hand plans for strengthening of track and enhancing of sectional speed.

The General Manager directed the officials/staff to be more vigilant in train operations and he advised to accord top priority for safety. He also instructed officials to monitor speed restrictions meticulously and ensure punctual running of Trains.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X