हैदराबाद: तेलंगाना में पंचायत चुनाव के पहले फेज़ के नॉमिनेशन खत्म हो गए हैं। गुरुवार को शुरू हुए नॉमिनेशन शनिवार शाम 5 बजे खत्म हो गए। पहले फेज़ के चुनाव के तहत 31 जिलों के 189 मंडलों में 4236 सरपंच स्थानों और 37,440 वार्ड के लिए चुनाव होने वाले हैं।
अधिकारी कल नॉमिनेशन की जांच करेंगे और वैलिड उम्मीदवारों की लिस्ट तैयार करेंगे। अगर सरपंच और वार्ड मेंबर उम्मीदवार का नॉमिनेशन रिजेक्ट हो जाता है, तो उम्मीदवार 31 दिसंबर तक संबंधित रेवेन्यू डिविजनल और सब-कलेक्टर के पास अपील कर सकते हैं। अपील पर 2 दिसंबर को फैसला होगा। नॉमिनेशन वापस लेने की आखिरी तारीख 3 दिसंबर है। उसी दिन दोपहर 3 बजे के बाद उम्मीदवार मैदान में उतरे उम्मीदवारों की लिस्ट जारी करेंगे और उन्हें चुनाव निशान दिए जाएंगे।
11 दिसंबर को सुबह 7 बजे से दोपहर 1 बजे तक वोटिंग होगी और उसी दिन दोपहर 2 बजे से वोटों की गिनती होगी और नतीजे घोषित किए जाएंगे। नॉमिनेशन प्रोसेस खत्म होने के साथ ही उम्मीदवारों ने कैंपेनिंग पर फोकस कर लिया है। वे वोटर्स को लुभाने के लिए तरह तरह के वादों की उम्मीदवारों के बीच होड़ लगी हैं।
पहले फेज के चुनाव होने वाले पंचायत चुनावों के साथ पूरे तेलंगाना में सर्वसम्मति से सरपंच चुने जाने की चर्चा चल पड़ी है। कई गांवों में सरपंच और वार्ड मेंबर सर्वसम्मति से चुने गए। मुख्यमंत्री रेवंत रेड्डी के गांव कोंडारेड्डीपल्ली के सरपंच को सर्वसम्मति से जीत गया है। रेवंत रेड्डी के बचपन के दोस्त और क्लासमेट वेंकटय्या सरपंच चुने गए है। कोंडारेड्डीपल्ली में सरपंच का पद एससी के लिए रिजर्व था और कुल 15 उम्मीदवार चुनाव मैदान रहे। इसी क्रम में गांव के सभी बड़े-बुजुर्ग एक हो गये और एकमत से सरपंच को चुना।
दूसरे फेज़ के चुनाव के लिए नॉमिनेशन रविवार से लिए जाएँगे। दूसरे फेज़ में नॉमिनेशन स्वीकार ने की आखिरी डेडलाइन 2 दिसंबर तय की गई है। नॉमिनेशन की स्क्रूटनी 3 दिसंबर को होगी और 6 दिसंबर को नॉमिनेशन वापस लिए जा सकेंगे। उसी दिन उम्मीदवारों की फाइनल लिस्ट जारी की जाएगी और उन्हें चुनाव निशान दिए जाएँगे। अगले महीने की 14 तारीख को वोटिंग होगी और उसी दिन नतीजे भी घोषित किए जाएँगे।
यह भी पढ़ें-
ముగిసిన తొలి దశ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పర్వం
హైదరాబాద్ : తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం మొదలైన నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు.
రేపు నామినేషన్లను పరిశీంచి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితాను అధికారులు రెడీ చేయనున్నారు. ఒక వేళ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్లు తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారిపై డిసెంబర్ 31 వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్లీళ్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అభ్యర్థులు ప్రకటించి వారికి ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు.
డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఓటర్లను తమ వైపు ఆకర్శించేలా హామీలు ఇచ్చేందుకు ప్రథ్యర్థులతో పోటీ పడుతున్నారు.
మొదటి విడత ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏకగ్రీవాల సందడి నెలకొంది. పలు గ్రామాల్లో సర్పంచ్‍లు, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంది పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు అంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు.
రేపటి నుంచి రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 2 వరకు తుది గడువు విధించారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజున అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయించనున్నారు. వచ్చే నెల 14న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితం ప్రకటిస్తారు. (ఏజెన్సీలు)
