हैदराबाद : तेलंगाना में पंचायत चुनाव के दूसरे फेज़ में कुछ जगहों पर मामूली झड़पें हुईं। जबकि कुछ जगहों पर शांति पूर्वक चुनाव हुए। कुछ जगहों पर जीतने वालों का ऐलान ड्रॉ से करना पड़ा। क्योंकि दोनों उम्मीदवारों को बराबर वोट मिले। इसलिए चुनाव अधिकारियों ने लकी ड्रॉ निकालकर जीतने वालों का ऐलान किया। पंचायत चुनाव के पहले फेज़ में भी इस तरह लक्की ड्रा निकाला गया। पंचायत चुनाव के इस दूसरे फेज़ में भी कांग्रेस पार्टी के समर्थक अधिक जीते हैं।
पार्टी दूसरे नंबर पर बीआरएस है। हमेशा की तरह भारतीय जनता पार्टी तीसरे नंबर पर ही सिमट गई है। पंचायत चुनाव के दूसरे फेज़ में कांग्रेस पार्टी के 2239 समर्थक गांव के सरपंच बने हैं। बीआरएस पार्टी के 1186 समर्थक जीते हैं। भारतीय जनता पार्टी के 268 उम्मीदवार जीते हैं। अन्य 624 सरपंच बने हैं। तेलंगाना में पंचायत चुनाव का तीसरा फेज़ 17 दिसंबर को होगा।
यह भी पढ़ें-
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం
హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు కొన్నిచోట్ల చిన్నపాటి గొడవలు జరగగా, మరికొన్ని స్థానాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో డ్రా ద్వారా విజేతలను ప్రకటించాల్సి వచ్చింది. ఇరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో, లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు ఎన్నికల అధికారులు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇక ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఆధిక్యం ప్రదర్శించారు.
అటు రెండో స్థానంలో గులాబీ పార్టీ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎప్పటి లాగే భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2239 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గ్రామ సర్పంచ్ లుగా విజయం సాధించారు. 1186 మంది గులాబీ పార్టీ మద్దతుదారులు విక్టరీ కొట్టారు. 268 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు విజయం సాధించారు. ఇక ఇతరులు మొత్తం 624 మంది సర్పంచ్ లుగా గెలిచారు. ఇక డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. (ఏజెన్సీలు)
