• లోకసభలో మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు
• పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ సమాధానం
హైదరాబాద్ : విమానయాన పరిశ్రమకు గత మూడేళ్లలో రూ. 28,907 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్(రిటైర్డ్) వెల్లడించారు. ఈ మేరకు గురువారం లోకసభలో మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిచ్చారు.
విమానయాన పరిశ్రమకు 2021-22లో రూ. 11658 కోట్లు, 2020-21లో రూ.12,479 కోట్లు, 2019-20లో రూ.4,770 కోట్ల నష్టం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై వ్యాట్ తగ్గించడం, ఎయిర్ పోర్ట్ నిర్వహణ సంబంధిత అంశాలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి చర్యలు చేపట్టినట్లు సింగ్ తెలిపారు.
అంతేకాకుండా నూతన టెర్మినల్స్ నిర్మాణం, విస్తరణకు సంబంధించి వచ్చే ఐదేళ్లలో రూ. 98 వేల కోట్లు ఖర్చు చేయాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ను కూడా ప్రభుత్వం ఆమోదించినట్లు వీకే సింగ్ తెలిపారు.
Aviation Industry in Rs. 28,907 crore losses
• Answer by VK Singh, Minister of State for Civil Aviation to Malkajigiri MP Revanth Reddy’s question in Lok Sabha.
Answering a question asked by Malkajigiri MP Revanth Reddy in the Lok Sabha Union Minister of State for Civil Aviation General Dr VK Singh (retd) revealed that in the last three years, the aviation industry suffered losses worth Rs. 28,907 crores.
The aviation industry suffered a loss of Rs. 11658 crore in 2021-22, Rs.12,479 crore in 2020-21 and Rs.4,770 crore in 2019-20, the minister said. Singh said that measures such as the reduction of VAT on Aviation Turbine Fuel (ATF) used in aeroplanes and the reduction of GST on airport maintenance-related matters from 18 to 5 per cent have been taken to recover from the losses.
He mentioned that additionally, for the construction and expansion of new terminals in the next five years, the Airports Authority of India has decided to spend Rs. 98 thousand crores. VK Singh said that the government has also approved the Emergency Credit Line Guarantee Scheme to facilitate easy access to loans for airlines.