हैदराबाद: तेलंगाना के वनपर्ती जिले के कोत्तापेट में राष्ट्रीय राजमार्ग-44 के पास एक भीषण सड़क हादसा हो गया। तेज रफ्तार टीएसआरटीसी बस अनियंत्रित होकर पलट गई। इस हादसे में 14 यात्री घायल हो गए और तीन अन्य की हालत गंभीर बताई गई है। पुलिस ने घायलों को वनपर्ती सरकारी अस्पताल में भर्ती कराया।
హైదరాబాద్ : వనపర్తి (తెలంగాణ) జిల్లాలోని కొత్తపేట వద్ద జాతీయ రహదారి-44 పక్కన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులకు గాయాలవ్వగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యాదగిరిగుట్ట నుంచి తిరుపతి వెళుతుండగా కొత్తపేట బైపాస్ వద్ద గుంతలో పల్టీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మిలిగిన ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
నర్సింహ, షబ్బీర్, షకీల అనే ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదం జరగడానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇతర వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. గాయపడిన ప్రయాణికులకు సంబంధించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)