హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ సమీపంలో ఆదివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా పెద్దషాపూర్ సమీపంలో పోలీసులు కాసేపు ట్రాఫిక్ నిలిపివేసినట్లు సమాచారం. సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాత పోలీసులు వాహనాలను వెళ్లేందుకు అనుమతించారు. ఈ సమయంలో వాహనాలన్నీ రోడ్డుపై అతివేగంతో వెళ్లడం ప్రారంభించాయి. ఈ సమయంలో అతివేగంతో ఎదురుగా వెళ్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడిపోయారు. అతివేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతులను మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం కడియాలకుంట తండాకు చెందిన గోపాల్ నాయక్ (47), అంజలి (42), స్వాతి (9)గా గుర్తించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కాన్వాయ్ బయలుదేరిన అరగంటలోనే జరగడం గమనార్హం. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.