Hyderaabad: ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వేమూరు మండలం జంపని వద్ద సోమవారం వేకువ ఝామున రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఈ రోడ్డు ప్రమాదంలో మరో 16మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు.

మృతులను బొల్లిశెట్టిపండురంగారరావు, బుద్దన పవన్ కుమార్, బార్డటి రమేష్, పాశంరమేష్గా గుర్తించారు పోలీసులు. మృతులది కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, నిలపూడి గ్రామంగా గుర్తించారు. ఘటన సమయంలో వాహనంలో 22 మంది ఉన్నారని, పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
