हैदराबाद: तेलंगाना में पिछले कुछ दिनों से बारिश हो रही है। बंगाल की खाड़ी में बने ट्रफ के प्रभाव से प्रदेश में बारिश हो रही है। हैदराबाद के मौसम विज्ञान केंद्र ने भविष्यवाणी की है कि अगले दो दिनों तक राज्य के कई जिलों में बारिश होगी। मौसम विभाग ने कहा कि उत्तरी तेलंगाना जिलों में बारिश की अधिक संभावना है।
मौसम विभाग ने आगे कहा कि निजामाबाद, मंचिरयाला, निर्मल, आदिलाबाद, आसिफाबाद और अन्य जिलों में मध्यम बारिश हो सकती है। इसके चलते उन जिलों को येलो अलर्ट जारी कर दिया गया है। आईएमडी ने लोगों को सतर्क रहने की सलाह दी है क्योंकि इस दौरान गरज के साथ बिजली गिरने और तेज़ हवाएं चलने की संभावना है। द्रोणि के प्रभाव के कारण, आंध्र प्रदेश के अल्लूरी, अंबेडकर कोनसीमा, पूर्वी गोदावरी, एलुरु, गुंटूर, बापटला, पलनाडु और प्रकाशम जिलों में गरज के साथ मध्यम बारिश होने की संभावना है।
बेमौसम बारिश किसानों के लिए परेशानी का कारण बन गई है। आम, शकरकंद, नींबू जैसी बागवानी फसलों को भारी नुकसान हुआ है। मक्का और धान जैसी फसलें ओलावृष्टि से नष्ट हो गईं। किसानों का कहना है कि बेमौसम बारिश से भारी नुकसान हुआ है। किसान परेशान है कि अगर दोबारा बारिश होती है तो फसलें पूरी तरह बर्बाद हो जाएंगी।
संबंधित खबर:
इसी क्रम में मंत्री तुम्मला नागेश्वर राव ने साफ कर दिया है कि असामयिक बारिश से पीड़ित हर किसान की मदद की जाएगी। उन्होंने कहा कि किसानों की फसल के नुकसान का सर्वे कराने का आदेश दिया गया है और रिपोर्ट मिलते ही सीएम रेवंत रेड्डी के आदेशानुसार किसानों को मदद मुहैया करायी जायेगी। उन्होंने कहा कि असामयिक बारिश के कारण किसानों की फसल बर्बाद होना दुखद है और सरकार तदनुसार किसानों को मदद करेगी। किसानों को चिंता करने की जरूरत नहीं है। क्योंकि जनता की सरकार है।
తెలంగాణలో వర్షసూచన, రైతుల్లో టెన్షన్
హైదరాబాద్ : తెలంగాణలో గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎకువ అవకాశం ఉందని చెప్పారు.
నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని తెలిపారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలోని అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
అకాలవర్షాలు రైతులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. మామిడి, బత్తాయి, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మొకజొన్న, వరి వంటి పంటలు వడగండ్లతో నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు తీరనినష్టాన్ని మిగుల్చుతున్నాయని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని టెన్షన్ పడుతున్నారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసారు. నేటి నుంచి రైతువారీ పంట నష్టాలపై సర్వేకు ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే సీఎం ఆదేశానుసారం రైతులకు సాయం అందిస్తామని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు పంటలు కోల్పోవడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు. (ఏజెన్సీలు)