हैदराबाद: तेलंगाना के नये राज्यपाल सीपी राधाकृष्णन ने यादाद्रि लक्ष्मीनरसिम्हा स्वामी के दर्शन किये। बुधवार को तेलंगाना गवर्नर का कार्यभार संभालने के बाद उन्होंने भगवान लक्ष्मीनरसिम्हा के दर्शन किए और मंदिर में विशेष पूजा-अर्चना की। पहली बार मंदिर आये राज्यपाल का सीएस शांताकुमारी व ईओ भास्कर राव ने फूलों का गुलदस्ता देकर स्वागत किया। मंदिर के पुजारियों द्वारा वैदिक आशीर्वाद प्रदान किया गया। बाद में राज्यपाल सीपी राधाकृष्णन को स्वामी का प्रसाद भेंट किया गया।
तमिलिसाई सौंदरराजन ने मंगलवार को तेलंगाना के राज्यपाल पद से इस्तीफा दे दिया। बाद में वह तमिलनाडु बीजेपी में शामिल हो गईं। खबर है कि वह लोकसभा चुनाव लड़ रही हैं। इसके साथ ही राष्ट्रपति द्रौपदी मुर्मू ने सीपी राधाकृष्णन को तेलंगाना का नया राज्यपाल नियुक्त किया।
बुधवार सुबह 11.15 बजे राजभवन के दरबार हॉल में तेलंगाना हाई कोर्ट के मुख्य न्यायाधीश आलोक आराधे को राधाकृष्णन को तेलंगाना के राज्यपाल के रूप में शपथ दिलाई। सीपी राधाकृष्णन, जो वर्तमान में झारखंड के राज्यपाल हैं, को तेलंगाना के राज्यपाल का अतिरिक्त प्रभार दिया गया है। इस कार्यक्रम में मुख्यमंत्री रेवंत रेड्डी और हरियाणा के राज्यपाल बंडारू दत्तात्रेय शामिल हुए। सीपी राधाकृष्णन को तेलंगाना के साथ-साथ पुदुचेरी (Puducherry) की भी जिम्मेदारी सौंपी गई है।
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. బుధవారం తెలంగాణ గర్నవర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి ఆలయానికి వచ్చిన గవర్నర్ కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు సీఎస్ శాంతకుమారి,ఈవో భాస్కర్రావు. వేదాశీర్వాదాలు అందించారు ఆలయ అర్చకులు. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు స్వామివారి ప్రసాదం అంద జేశారు.
మంగళవారం తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు. అనంతరం ఆమె తమళనాడు బీజేపీలో చేరారు. ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కొత్త గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
బుధవారం ఉదయం 11.15 గంటలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ చేత ప్రమాణ చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సీసీ రాధాకృష్ణన్ కు తెలంగాణతోపాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ బాధ్యతలు అప్పగించారు. (ఏజెన్సీలు)