हैदराबाद : तेलंगाना में रविवार को कई जगहों पर तूफानी हवाओं के साथ बारिश हुई। तेलंगाना के कई स्थानों पर कल तक धूप से धधक रहा था। आज बूंदाबांदी होने से मौसम ठंडा हो गया। इससे लोगों को धूप से कुछ राहत मिली है। कई जगहों पर आसमान में बादल छाए हुए हैं।
वरंगल जिले में अचानक मौसम ठंडा हो गया और बारिश हो गई। मुलुगु जिले के एटुरुनागारम उपमंडल में गरज के साथ बारिश हुई। खम्मम में तेज हवाओं के साथ जमकर बारिश हुई। नलगोंडा जिले में जगह-जगह हल्की बारिश हुई।
दूसरी ओर, संयुक्त वरंगल जिले में अप्रिय घटना घटी है। आकाशीय बिजली गिरने से दो किसानों की मौत हो गई। मुलुगु जिले के एटपरुनागारम के किसान बासा बुल्लय्या (46) और जनगांव जिले के रघुनाथपल्ली के किसान दासरी अजय (39) की बिजली गिरने से मौत हो गई। इसके अलावा मुलुगु जिले के एटुरुनागारम में खरीद केंद्रों में बारिश होने के कारण अनाज भीग गया है।
ఖమ్మంలో దంచికొడుతున్న వాన.. #rain #Weather #WeatherUpdate #Telangana #chotanews pic.twitter.com/BF4vYVOMwU
— ChotaNews (@ChotaNewsTelugu) May 5, 2024
తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం
హైదరాబాద్ : తెలంగాణలో పలుచోట్ల ఆదివారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. నిన్నటి వరకు ఎండలు మండి పోగా నేడు కాస్త చినుకులు కురవడంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం కూల్ అయ్యింది. దీంతో ప్రజలు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది.
వరంగల్ జిల్లాలో ఒక్కసారి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మంలో ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. నల్గొండ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో రైతు బాస బుల్లయ్య (46), జనగామ జిల్లా రఘునాథపల్లిలో రైతు దాసరి అజయ్(39) పిడుగు పాటుకు మృతి చెందారు. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. (ఏజెన్సీలు)