నిరసనను విరమించమని కోరిన వీసీ
సమస్య పరిష్కారానికి మీతో కలిసి పనిచేస్తా: ప్రొ. ఘంటా చక్రపాణి
BRAOU ఉపకులపతి హామీతో నిరసన కార్యక్రమాలు తాత్కాలిక వాయిదా
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూమిలో కొంత భాగాన్ని వేరే యూనివర్సిటీ కి కేటాయిస్తూ ఇచ్చిన లేఖను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి ప్రయత్నం చేస్తామాని ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి జేఏసీకి హామీ ఇచ్చారు.
[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ సభ్యులు ఉద్యోగులు, విద్యార్థులు గత 81 రోజులుగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
ధర్నా జరుగుతున్న ప్రాంతానికి నూతనంగా నియామకమైన వైస్–ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి ప్రత్యక్షంగా హాజరై నిరసనలో ఉన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి అందరం కలిసి పని చేద్దామని తన మీద నమ్మకంతో కొంత కాలం నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అనంతరం జేఏసీ అత్యవసరంగా సమావేశమై సమగ్రంగా చర్చించారు.
Also Read-
అనతరం జేఏసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; జేఏసి కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వీసీ హామీ మేరకు నిరసన కార్యక్రమాలను కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసి నేతలు డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. వై. వెంకటేశ్వర్లు; కాంతం ప్రేమ కుమార్, డా. యాకేశ్ దైద; ప్రొ. చంద్రకళ, ఎన్. సి. వేణుగోపాల్, డా. నారాయణ రావు, రుశేంద్రమణి, రజనీకాంత్, పాండు, షబ్బీర్, డా. కిషోర్; డా. రాఘవేంద్ర; విద్యార్థులు తదితరులు ఉన్నారు.