తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం మూడో అంతస్తులోని సమావేశ మందిరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొడిబ.

దశదిశలా చాటేలా దశాబ్ది వైభవం

తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం… ఇక్కడ దాదాపు 55 నుండి 60 శాతం ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు

అత్యధిక శాతం జనాభాకు ఈ రంగం నుండి ఉపాధి లభిస్తున్నది

గత పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం స్వరూపం మారిపోయింది

తెలంగాణ వ్యవసాయం దేశానికి దిక్సూచిలా నిలిచింది

తెలంగాణ వ్యవసాయ పథకాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్నారు

రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు రైతులలో ఆత్మవిశ్వాసం పెంచింది

ఐదేళ్లలో రైతుబంధు ద్వారా పది విడతల్లో నేరుగా రూ.65 వేల కోట్లు వారి ఖాతాలలో జమచేయడం జరిగింది

రైతుభీమా పథకం కింద పరిహారం అందుకున్న రైతు కుటుంబాల సంఖ్య లక్ష దాటింది

తెలంగాణ వరి ఉత్పత్తిలో నంబర్ వన్ .. తెలంగాణ పత్తి, వేరుశనగ నాణ్యతలో నంబర్ వన్

పంటల కొనుగోళ్లతో కనీస మద్దతుధర రైతులకు అందేలా చూసి ప్రభుత్వం అండగా నిలిచింది

తెలంగాణ ప్రభుత్వ చర్యలతో పంటల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగింది

ఈ నేపథ్యంలో జూన్ 2 నుండి 21 రోజుల పాటు పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పురోభివృద్ధి కొరకు పాటుపడిన అంశాలను, విజయాలను భిన్నమైన కార్యక్రమాల ద్వారా చాటిచెబుతాం

వ్యవసాయ శాఖ తరపున గత పదేళ్ల వ్యవసాయ విజయాలను వివరిస్తూ రైతాంగానికి, ప్రజలకు చేరేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం

రైతు వేదికలు, చెరువులు, రిజర్వాయర్లు వద్ద కార్యక్రమాలతో తెలంగాణ వ్యవసాయ విజయాలు వివరించాలి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై వ్యవసాయ శాఖలోని వివిధ విభాగాల నుండి వచ్చిన సూచనలు, సలాహాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం

దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలలోని అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం మూడో అంతస్తులోని సమావేశ మందిరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొడిబ, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అన్ని శాఖల ఎండీలు, కార్పోరేషన్ల బాధ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X