हैदराबाद : तेलंगाना के मशहूर तीर्थस्थल यादगिरीगुट्टा लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर से सोने और चांदी के डॉलर गायब होने से हड़कंप मंच गया है। भक्तों को बेचने के लिए रखे गए बड़ी संख्या में सोने और चांदी के सिक्के गायब होने की बात मंदिर के लोगों में चर्चा का विषय बन गई है। हाल ही में, ऑडिट अधिकारियों के इंस्पेक्शन के दौरान ये गड़बड़ियां सामने आईं।
खासकर, अधिकारियों ने पाया कि मंदिर के पब्लिसिटी डिपार्टमेंट में रखे सिक्के के अकाउंट में भारी अंतर पाया गया। अधिकारियों ने कहा कि भगवान की सिक्के की कीमत खुले बाजार में करीब 10 लाख रुपये है। चूंकि स्टॉक रजिस्टर में अकाउंट मौजूद सिक्कों की संख्या से मेल नहीं खाते हैं। इसलिए शक है कि स्टाफ ने हाथ की सफाई दिखाई होगी।

मंदिर अधिकारियों ने इस घटना पर गुस्सा जताया और जांच के आदेश दिए। पब्लिसिटी डिपार्टमेंट में काम करने वाले स्टाफ की लापरवाही की वजह से यह चोरी हुई। भक्त पूरे मामले की पूरी जांच और जिम्मेदार लोगों के खिलाफ सख्त कार्रवाई की मांग कर रहे हैं। हालांकि, यह ध्यान देने वाली बात है कि सोने और चांदी के सिक्के के गायब होने के बारे में मंदिर अधिकारियों की तरफ से अभी तक कोई बयान नहीं आया है।
Also Read-
యాదగిరిగుట్ట ఆలయంలో విలువైన బంగారు, వెండి, నాణేల మాయం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి నాణేల మాయమమైన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి నాణేల పెద్ద సంఖ్యలో గల్లంతవ్వడం ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఆలయ రికార్డులను తాజాగా పరిశీలించిన ఆడిట్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగు చూశాయి.
ముఖ్యంగా ఆలయానికి చెందిన ప్రచార శాఖలో నిల్వ ఉంచిన నాణేల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో ఉన్న నాణేల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్టాక్ రిజిస్టర్లోని లెక్కలకు, భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే బంగారం, వెండి నాణేల కనిపించకపోవడంపై ఇప్పటి వరకు ఆలయం అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. (ఏజెన్సీలు)
