BRS : కేసీఆర్ కుటుంబం తెలంగాణ, మోదీ కుటుంభం అధాని

పీడీఎస్ బియ్యంపై ప్రధాని హోదాలో అభద్దం చెప్పడం బాధాకరం

తెలంగాణ వచ్చినప్పటి నుండి ఒక్క రేషన్ కార్డును కేంద్రం పెంచలేదు

ఒక్క లబ్దీదారునికి అధనంగా ఇవ్వలేదు

రాష్ట్రమే అధనంగా 91 లక్షల మందికి రేషన్ అందిస్తుంది

బీసీ పీఎం వెనుకబడినవర్గాలకు ఏమన్నా చేస్తాడేమో అంటే నిరాశే మిగిల్చాడు

రైతులు కోతలు మొదలయ్యాయి ఏమన్నా మేలు చేస్తాడేమో అంటే నిరాశే మిగిల్చాడు

మన ధాన్యం కొనమని, నూకలు తినుమని పియూష్ గోయల్ అన్నదాన్ని కాదని కొంటానని చెప్తాడేమో అనుకుంటే నిరాశే మిగిల్చాడు

ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమం చేసాడు

సీఎం కేసీఆర్ ను విమర్శించే అర్హత లేనే లేదు

టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్ : రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీగా వచ్చారా? పార్టీ వ్యక్తిగా వచ్చారా? అని ప్రశ్నించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో మిడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో మోదీ రేషన్ బియ్యంపై అభద్దాలు మాట్లాడటం బాధకరమని, పేదల పట్ల కనీస ఆపేక్ష లేకుండా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటివరకూ ఒక్క లబ్దీదారున్ని కూడా కేంద్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం 53 లక్షల కార్డులు 1.91 కోట్ల మందికి కిలో 3 రూ. చొప్పున ఒక్కొక్కరికి 5 కిలోలు ఇస్తుంటే, ఏ ఒక్క నిరుపేద సైతం ఆకలితో అలమటించకూడదని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధనంగా 96 లక్షల మందికి ఆరుకిలోల్ని రూపాయికే అందిస్తున్నామన్నారు. 

ఇప్పటివరకూ ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 27వేల కోట్ల రూపాయల్ని ఖర్చుచేసిందని మోదీకి గుర్తుచేసారు మంత్రి గంగుల. కరోనా విపత్తులో సైతం బీహార్, యూపి, తదితర ఉత్తరాది వారికి సైతం రేషన్తో పాటు నగదును అందించిన విషయాన్ని ప్రధాని తెలుసుకోవాలన్నారు. ఏ ఏటికాయేడు పేదలను గుర్తిస్తూ 6.70 లక్షల కార్డులను అధనంగా జారీచేసామన్నారు మంత్రి. ఓవైపు రాష్ట్రంలో పంటలు కోతకొస్తుంటే గతంలో పియూష్ గోయల్ మన ధాన్యం కొనమని, మనల్ని నూకలు తినండని చెప్పిన మాటను వెనక్కి తీసుకొంటాడని, ప్రధాని హోదాలో మన రైతుల దగ్గరనుండి ధాన్యం కొంటానని చెప్తాడని ఆశగా ఎదురుచూసిన రైతుకు మొండిచేయే చూపారని మంత్రి గంగుల ఆవేదన వ్యక్తం చేసారు. 

దీంతో పాటు బీసీ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ఏదో మేలు చేస్తాడని వెనుకబడిన వర్గాలు ఎంతో ఆశగా చూసామని కానీ వాటన్నింటిని అడియాసలు చేసాడని ఆవేదన వ్యక్తం చేసారు. విభజన హామీలను నేరవేరుస్తారనే ఆశ అడియాసైందని, దేశం మొత్తంలో కేంద్రం బీసీలను కనీసం 90వేల మందిని కూడా గురుకులాల్లో చదివించడం లేదని అదే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1లక్షా 80వేల మందికి ప్రపంచ స్థాయి విద్యను గురుకులాల్లో అందిస్తున్నామన్నారు. బీసీ మంత్రిత్వ శాఖ, బీసీ జనగణనలపై నోరు మెదపకపోవడం దురద్రుష్టం అన్నారు.

కేసీఆర్ కుటుంభ పాలన అని మాట్లాడిన మోదీ తీరును తప్పుబట్టిన గంగుల, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఐతే మోదీ కుటుంబం అధానీ మత్రమేనని దుయ్యబట్టారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నారాయణరాణే తదితర బీజేపీలో చేరిన నేతలపై సీబీఐ, ఈడీ కేసులేమయ్యాయని ప్రశ్నించిన మంత్రి, ప్రతిపక్షంలో ఉన్నామనే తమని వేదించడం బీజేపీ నైజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ కేసులు, పంచన చేరితే క్లీన్ చీట్లు ఇదే కదా బీజేపీ సంస్క్రుతి అని దుయ్యబట్టారు. మొత్తం ప్రధాని పర్యటన వెనుకబడిన వర్గాలకు, రైతులకు మేలు చేయకపోగా తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

మహాత్మా జ్యోతిభాపూలే 197వ జయంతి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిభాపూలే197వ జయంతి వేడుకల పోస్టర్ని మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, ఎల్. రమణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్సవ కమిటీ ప్రతినిధుల సమక్షంలో అసెంబ్లీ ఆవరణలో నేడు ఆవిష్కరించారు. ఈనెల 11న ఉదయం 10గంటల నుండి రవీంద్రబారతిలో నిర్వహించే మహాత్మా జ్యోతిభాపూలే జయంతి వేడుకలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మహత్మా జ్యోతిభాపూలే జయహో నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X