हैदराबाद : अधिकारियों ने घोषणा की है कि पॉलिटेक्निक कॉलेजों में डिप्लोमा पाठ्यक्रमों में प्रवेश के लिए पिछले महीने आयोजित पॉलीसेट-2024 के परिणाम सोमवार को जारी किए जाएंगे। इसी समय आईटीए पॉलिटेक्निक कॉलेजों में लेटरल एंट्री के माध्यम से माध्यमिक में प्रवेश के लिए आयोजित एलपी सेट के परिणाम भी जारी करेगा।
शिक्षा सचिव बुर्रा वेंकटेशम दोपहर 12 बजे मासाब टैंक स्थित तकनीकी शिक्षा बोर्ड कार्यालय में परिणाम जारी करेंगे। 24 मई को आयोजित परीक्षा में 82,809 छात्र शामिल हुए थे।
इस परीक्षा में उत्तीर्ण होने वाले छात्रों को तीन वर्षीय इंजीनियरिंग और गैर-इंजीनियरिंग डिप्लोमा पाठ्यक्रमों के साथ-साथ कृषि, बागवानी और पशु चिकित्सा डिप्लोमा पाठ्यक्रमों में प्रवेश मिलेगा। इसके लिए पॉलीसेट प्रवेश काउंसलिंग इस महीने की 20 तारीख से शुरू होगी, इसके लिए शेड्यूल भी जारी कर दिया गया है।
यह भी पढ़ें-
ఈ రోజు పాలిసెట్–2024 మరియు ఎల్పీ సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గత నెలలో నిర్వహించిన పాలిసెట్–2024 ఫలితాలను సోమవారం రిలీజ్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ సమయంలోనే ఐటీఏ ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో చేరేందుకు నిర్వహించిన ఎల్పీ సెట్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు.
మాసబ్ ట్యాంక్‌లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మే 24న జరిగిన పరీక్షకు 82,809 మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు.
ఈ పరీక్షలో క్వాలిఫై అయిన స్టూడెంట్లు మూడేండ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందనున్నారు. కాగా, ఈ నెల 20 నుంచి పాలిసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. (ఏజెన్సీలు)