हैदराबाद: तेलंगाना के रंगारेड्डी जिले के शादनगर में चोरी के बहाने एक दलित महिला पर पुलिस द्वारा थर्ड डिग्री हमले की घटना से हंगामा मच गया। आरोप है कि जांच के नाम पर रात में दलित महिला को न सिर्फ थाने ले गये, बल्कि पुलिस ने उसके कपड़े उतारकर अंधाधुंध पिटाई भी कर दी। इसी क्रम में अमेरिका के दौरे पर मुख्यमंत्री रेवंत रेड्डी को इस मामले की जानकारी मिली तो वे गंभीर हो गये। उन्होंने इस केस की समग्र जांच के लिए वरिष्ठ अधिकारियों को आदेश दिया। साथ ही आश्वासन दिया कि आरोपी अधिकारियों के खिलाफ कड़ी कार्रवाई की जाएगी और सरकार पीड़ित परिवार के साथ खड़ी है।
मीडिया में प्रसारित और प्रकाशित तथा पीड़ित महिला के मुताबिक, सुनीता और भीमय्या दंपति शादनगर शहर के अंबेडकर नगर कॉलोनी में रहते हैं। उनका बेटा जगदीश (13) एक स्थानीय स्कूल में कक्षा 9 वीं में पढ़ता है। उनके घर के सामने आरएमपी नागेंद्र रहते हैं। उसकी पत्नी शिक्षिका के पद पर कार्यरत हैं. हालांकि, पिछले महीने की 24 तारीख को नागेंद्र क्लिनिक गया था और उसकी पत्नी स्कूल गई थी। शाम को जब वह लौटे तो देखा कि घर में चोरी हो गयी है। घर में 26 तोला सोना और दो लाख रुपये नकद नहीं मिले और आलमारा जैसा की वैसा ही बंद होने की पुलिस से शिकायत की। उनके घर के सामने रहने वाले सुनीता और भीमय्या पर संदेह व्यक्त किया। शिकायत मिलने पर पुलिस ने धारा 331(3) और धारा 305 (बी) के तहत मामला दर्ज कर जांच शुरू कर दी है।
आरएमपी नागेंद्र ने पुलिस को दी शिकायत में यह भी कहा कि सुनीता के घर के सामने सोना मिला है और उन्होंने ही चोरी की है। इसके बाद जासूस इंस्पेक्टर राम रेड्डी व चार अन्य पुलिसकर्मियों ने रात 9 बजे सुनीता व भीमय्या और जगदीश को स्टेशन ले गए। कुछ देर बाद पुलिस ने भीमय्या को छोड़ दिया और चोरी कबूल कराने के लिए सुनीता और जगदीश को अंधाधुंध पीटा। बेटे के सामने सुनीता को निर्वस्त्र कर लाठियों से पीटा गया। जगदीश को पैरों के तलवों पर बेल्ट से भी पीटा गया। पिटाई से सुनीता बेहोश हो गई तो उसे स्थानीय अस्पताल ले गये। पीड़िता ने खुलासा किया कि पुलिस ने चोरी-छिपे स्थानीय अस्पताल में इलाज कराया और फिर शिकायतकर्ता की कार में ही उसे घर भेज दिया। उसने यह भी बताया कि पुलिस ने इस बारे में किसी को बताने पर जान से मारने की धमकी दी। उसने पीटने वाले पुलिस के खिलाफ कार्रवाई करने की अपील की है।
यह भी पढ़ें-
दलित महिला पर लगे थर्ड डिग्री के आरोप को लेकर साइबराबाद कमिश्नर अविनाश महंती गंभीर हो गए हैं। घटना की जांच के लिए उच्च अधिकारियों को आदेश दिए गए हैं। मीडिया को एक घोषणा जारी की गई कि रविवार रात को एक आदेश जारी किया गया और डीआई राम रेड्डी को साइबराबाद कमिश्नरेट से जोड़ा गया। कमिश्नर ने कहा कि एसीपी रंगास्वामी के नेतृत्व में उच्च अधिकारियों की टीम जांच कर रिपोर्ट देगी और उस रिपोर्ट के आधार पर आगे की कार्रवाई की जाएगी। एससी और एसटी आयोग के अध्यक्ष बक्की वेंकटय्या और एससी निगम के अध्यक्ष प्रीतम ने रविवार को शादनगर में पीड़ित दलित महिला सुनीता से उनके घर पर मुलाकात की। सुनीता ने बताया कि पुलिस ने उसे प्रताड़ित किया और न्याय की मांग की। इस मौके पर बोलते हुए वेंकटय्या और प्रीतम ने साफ किया कि कांग्रेस सरकार ऐसे हमलों को बर्दाश्त नहीं करेगी।
उन्होंने इस बात पर रोष जताया कि महिला को बिना महिला कांस्टेबल के ही रात में थाने ले जाकर पीटा गया। उनकी मांग है कि सुनीता की पिटाई करने वाले पुलिसकर्मियों को ड्यूटी से हटाया जाए और उनके खिलाफ एससी और एसटी का मामला दर्ज किया जाए। उन्होंने पीड़ित परिवार को आश्वासन दिया कि वे इस मामले को सीएम रेवंत रेड्डी के ध्यान में ले जाएंगे और सुनिश्चित करेंगे कि जिम्मेदार लोगों के खिलाफ सख्त कार्रवाई की जाए। उन्होंने स्पष्ट किया कि राज्य में सरकार बदल गयी है और यह जनता की सरकार है। डीआई राम रेड्डी ने कहा कि उन्होंने सुनीता को नहीं पीटा है। नागेंद्र की शिकायत के मुताबिक मामला दर्ज कर लिया गया है और संदिग्ध सुनीता को थाने लाकर पूछताछ की जा रही है। उन्होंने कहा कि जांच के बाद उसे वापस घर भेज दिया गया। लेकिन किसी पुलिस ने उसके साथ कुछ नहीं किया।
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ
హైదరాబాద్ : దొంగతనం నెపంతో ఒక దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కలకలం సృష్టించింది. విచారణ పేరుతో మహిళను రాత్రిపూట స్టేషన్ కు తీసుకెళ్లడమే కాకుండా బట్టలు సైతం విప్పించి పోలీసులు విచక్షణారహితంగా కొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఈ విషయంపై సమాచారం అందడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ కేసును సమగ్రంగా విచారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బాధిత మహిళ కథనం ప్రకారం షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సునీత, భీమయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కొడుకు జగదీశ్ (13) స్థానిక స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. వీరి ఇంటి ఎదురుగా ఆర్ఎంపీ నాగేందర్ ఉంటున్నాడు. ఆయన భార్య టీచర్ గా పని చేస్తోంది. అయితే, పోయిన నెల 24న నాగేందర్ క్లినిక్ కు, అతని భార్య స్కూల్ కు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చాక ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. ఇంట్లో ఉన్న 26 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు కనిపించలేదని, బీరువాకు వేసిన తాళం వేసినట్టే ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ఎదురుగా ఉన్న సునీత, భీమయ్యలపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సెక్షన్ 331(3), సెక్షన్ 305 (బీ) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, దొంగతనం చేసింది వాళ్లేనని ఆర్ఎంపీ నాగేందర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రాంరెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బందితో కలిసి సునీత, భీమయ్య, జగదీశ్ లను రాత్రి 9 గంటలకు స్టేషన్ కు తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత భీమయ్యను వదిలేసిన పోలీసులు సునీత, జగదీశ్ ను దొంగతనం ఒప్పుకోవాలని విచక్షణారహితంగా కొట్టారు. కొడుకు కండ్ల ముందే సునీత బట్టలు విప్పించి, చెడ్డీ తొడిగి కర్రలతో కొడుతూ దారుణంగా హింసించారు. జగదీశ్ ను సైతం అరికాళ్లపై బెల్ట్ తో కొట్టారు. దెబ్బలు తాళలేక సునీత స్పృహతప్పి పడిపోవటంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో గుట్టుగా చికిత్స చేయించిన పోలీసులు ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని బాధిత మహిళ వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని పోలీసులు బెదిరించారని తెలిపింది. తమను అన్యాయంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఉన్నతాధి కారులను ఆదేశించారు. డీఐ రాంరెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్టు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం విచారించి నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. బాధిత దళిత మహిళ సునీతను ఆదివారం షాద్ నగర్ లోని ఆమె ఇంటికి వెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ పరామర్శించారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారని, తమకు న్యాయం చేయాలంటూ సునీత తమ గోడును చెప్పుకుని విలపించింది. ఈ సందర్భంగా వెంకటయ్య, ప్రీతమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులను సహించబోదని స్పష్టం చేశారు.
మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మహిళను స్టేషన్ కు రాత్రిపూట తీసుకెళ్లి కొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతను కొట్టిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని బాధిత కుటుంబానికి వారు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, ఇది ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గతంలో మాదిరిగానే వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. సునీతను తాము కొట్టలేదని డీఐ రాంరెడ్డి తెలిపారు. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, అనుమానితురాలైన సునీతను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించామని చెప్పారు. విచారణ తర్వాత తిరిగి ఇంటికి పంపించామని, అంతేతప్ప ఆమెపై పోలీసులు ఎవరూ చెయ్యి చేసుకోలేదన్నారు. (ఏజెన్సీలు)