BRS को बड़ा झटका, पोचारम कांग्रेस पार्टी में शामिल, सीएम ने कही यह बड़ी बात और दानम ने किया धमाका

हैदराबाद: बीआरएस पार्टी को एक और बड़ा झटका लगा है। पोचारम श्रीनिवास रेड्डी कांग्रेस पार्टी में शामिल हो गये है। इस दौरान मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि पोचारम श्रीनिवास रेड्डी को तेलंगाना क्षेत्र के किसानों के कल्याण के लिए पार्टी में शामिल किया गया है। पोचाराम ने तेलंगाना के किसानों के कल्याण के लिए कड़ी मेहनत की है। रेवंत रेड्डी ने पार्टी का अंगवस्त्र पहनाकर पोचारम श्रीनिवास रेड्डी को कांग्रेस में आमंत्रित किया।

किसानों की बेहतरी के लिए पोचारम की सलाह लिये जाएंगे। पोचारम को किसान वर्ग को मजबूत करने के लिए पार्टी में आये है। मुख्यमंत्री ने आगे कहा कि पोचारम तेलंगाना के पुनर्निर्माण के लिए काम कर रहे हैं। जब पोचारम ने सरकार से सहयोग करने की बात कही तो उन्होंने ओके कहा है। उनकी सरकार खेती-किसानी को पर्व नहीं बल्कि महोत्सव बनाने जा रही है। कांग्रेस सरकार किसानों की सरकार है।

कांग्रेस पार्टी से ही किसानों का कल्याण : पोचारम

बीआरएस विधायक पोचारम श्रीनिवासुला रेड्डी ने खुलासा किया कि तेलंगाना में किसानों के कल्याण के लिए सीएम रेवंत रेड्डी के प्रयास सराहनीय हैं और पेयजल परियोजनाओं के लिए वह जो निर्णय ले रहे हैं वह अद्भुत हैं। एक कृषक परिवार के बेटे के रूप में वह किसानों के कल्याण के लिए सीएम रेवंत रेड्डी की नीतियों का समर्थन करते हैं।

यह भी पढ़े-

बीआरएस के 20 विधायक कांग्रेस पार्टी में शामिल हो रहे हैं – दानम

खैरताबाद विधायक दान नागेंद्र ने कहा कि बीआरएस के 20 विधायक जल्द ही कांग्रेस पार्टी में शामिल होंगे। बीआरएस पूरी तरह से खाली होने की संभावना है। केसीआर की नीतियों की आलोचना करते हुए उन्हें डूबता हुआ बीआरएस बताया है। पोचाराम के साथ सीएम की मुलाकात पर प्रतिक्रिया देते हुए दानम ने कहा कि पोचाराम श्रीनिवास रेड्डे नहीं बल्कि कई बीआरएस नेता और विधायक कांग्रेस में शामिल होने के इच्छुक हैं।

मुख्य रूप से काले यादैया, अरिकापुडी गांधी, गुडेम महिपाल यादव, मुठा गोपाल, सुधीर रेड्डी, कुतुबुल्लापुर विधायक विवेकानंद, कोत्ता प्रभाकर रेड्डी और प्रकाश गौड़ कांग्रेस में शामिल होने जा रहे हैं। मेडचल मल्लारेड्डी भी कांग्रेस में शामिल होने के लिए तैयार हैं। उन्होंने कहा कि सीएम रेवंत रेड्डी और सुनील कनुगोलु दो-तीन दिन से सीएम आवास पर शामिल होने को लेकर चर्चा कर रहे हैं।

पोचाराम के घर के पास बीआरएस नेताओं ने हंगामा किया

विधायक पोचाराम श्रीनिवास रेड्डी के आवास के पास बीआरएस नेताओं के हंगामे को सरकार ने गंभीरता से लिया है। पुलिस अधिकारियों को जिम्मेदार लोगों के खिलाफ कड़ी कार्रवाई करने का निर्देश दिया है। इसके साथ ही पुलिस अधिकारियों ने जांच शुरू कर दी. डीसीपी विजय कुमार और सीएम सीएसओ गुम्मी चक्रवर्ती ने मीडिया में दर्ज विजुअल और सीसी फुटेज की जांच की है। ड्यूटी पर मौजूद लोगों से ब्योरा मांगा गया। बीआरएस से जुड़े कुछ लोगों को पहले ही गिरफ्तार कर बंजारा हिल्स पुलिस स्टेशन ले जाया गया है। गिरफ्तार किए गए लोगों में बाल्का सुमन, मन्ने गोवर्धन, दुदिमेटला बलाराजू और गेलु श्रीनिवास यादव शामिल हैं। बंजारा हिल्स पुलिस ने उनके खिलाफ धारा 353, 448 रेड के साथ 34 आईपीसी के तहत मामला दर्ज किया है।

కాంగ్రెస్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత రైతుల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కృషి చేశారని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. రైతుల బాగోగుల కోసం పోచారం సలహాలు తీసుకుంటామని తెలిపారు. రైతాంగాన్ని పటిష్టం చేయడానికి పోచారంను పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరగానే పోచారం ఓకే చెప్పారని అన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అనేల తమ ప్రభుత్వం చేయబోతుందని తెలిపారు. తమది రైతు రాజ్యం రైతు ప్రభత్వమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ: పోచారం

తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం అని తాగునీటి ప్రాజెక్టుల కోసం అతను తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘం అని రైతు విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులరెడ్డి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారాయన.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారాయన. 2024, జూన్ 21వ తేదీ ఉదయం తన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిని సాదరంగా ఆహ్వానం పలికారు పోచారం శ్రీనివాసులరెడ్డి. ఆరు నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో పరిపాలన అద్భుతంగా ఉందని.. అభివృద్ధి పధంలో సాగుతుందని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఎంతో బాగున్నాయన్నారు పోచారం శ్రీనివాసులరెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం వెనక రాజకీయంగా ఆశిస్తున్నది ఏమీ లేదని మంచి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారని రైతు కోసం పని చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పోచారం. నా రాజకీయ ప్రస్తానం మొదలైందే కాంగ్రెస్ పార్టీలో అని ఆ తర్వాత టీడీపీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లు చెప్పిన ఆయన మళ్లీ ఇన్నాళ్లు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు పోచారం. వరుణుడు సైతం చల్లగా ఆశీర్వదిస్తున్నారంటూ మీడియా ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారాయన.

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీ పై దానం స్పందిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పారాయన. 

కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారని చెప్పారు. మేడ్చల్ మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చించారని చెప్పారు. 

పోచారం ఇంటి దగ్గర రచ్చ చేసిన బీఆర్ఎస్ నేతలు

MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం దగ్గర బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామా వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. మీడియాలో రికార్డ్ అయిన విజువల్స్ , సీసీ పుటేజ్ ను  పరిశీలించారు డీసీపీ విజయ్ కుమార్, సీఎం CSO గుమ్మి చక్రవర్తి. డ్యూటీ లో ఉన్నవారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే BRSకు చెందిన కొంతమందిని అరెస్ట్ చేసి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో బాల్క సుమన్, మన్నే గోవర్ధన్, దూదిమెట్ల బాలరాజు,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీరిపై 353, 448 రెడ్ విత్ 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X