हैदराबाद : फोन टैपिंग मामले में नामपल्ली कोर्ट ने शुक्रवार को मुख्य आरोपी प्रभाकर राव और एक अन्य आरोपी श्रवण कुमार के खिलाफ गैर जमानती वारंट जारी किया। इस वारंट के साथ ही पंजागुट्टा पुलिस सीआईडी और सीबीआई जांच एजेंसियों के माध्यम से अमेरिका में मौजूद प्रभाकर राव और श्रवण कुमार को रेड कॉर्नर नोटिस जारी करेगी।
इस गिरफ्तारी वारंट के संबंध में पुलिस ने सीआरपीसी की धारा-73 के तहत एक याचिका दायर की, जिसमें दावा किया गया कि पूर्व एसआईबी प्रमुख प्रभाकर राव इस मामले में मुख्य आरोपी हैं और अब तक गिरफ्तार पुलिस अधिकारी राधाकिशन राव, भुजंग राव तिरुपतन्ना और प्रणीत राव की साजिश के पीछे प्रभाकर राव का हाथ है।
इसके अलावा कोर्ट को बताया गया कि एसआईबी कार्यालय में सबूत और साक्ष्य नष्ट कर दिये गये। पुलिस ने अदालत को बताया कि गिरफ्तारी के दौरान आरोपी ने क्या क्या खुलासा किया है। इनकी साजिश निजी सुरक्षा के साथ-साथ राज्य की सुरक्षा के लिए भी गंभीर खतरा है। इसी तरह, पुलिस ने बुनियादी सबूतों के साथ अदालत में अपनी दलीलें पेश कीं कि दशकों से एकत्र की गई माओवादी और असामाजिक ताकतों की सभी जानकारी नष्ट कर दी गई।
संबंधित खबर-
दूसरी ओर प्रभाकर राव ने भी अपने वकील के जरिए हलफनामा दाखिल किया है। इससे यह साफ हो गया है कि फोन टैपिंग मामले में प्रभाकर राव की गिरफ्तारी होनी ही चाहिए।
ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందుతుడు ప్రభాకర్ రావు, మరో నిందుతుడు శ్రవణ్ కుమార్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ వారంట్‌తో పంజాగుట్ట పోలీసులు సీఐడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయనున్నారు.
ఈ అరెస్ట్ వారంట్‌కు సంబంధించి పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్-73 కింద పిటిషన్ వేసి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసులో ప్రధాన నిందుతుడని, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు రాధకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల కుట్ర వెనకాల మొత్తం ప్రభాకర్ రావు ఉన్నాడని వాడించింది.
అంతే కాకుండా ఎస్ఐబీ కార్యాలయంలో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వసం చేసి మాయం చేశారని కోర్టుకు తెలిపింది. అరెస్ట్ సందర్భంగా నిందుతులు వెల్లడించిన విషయాలను కోర్టుకు పోలీసులు వివరించారు. వారు చేసిన కుట్ర వ్యక్తిగత భద్రతతో పాటు రాష్ట్ర భద్రతకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా దశాబ్దాల పాటు సేకరించిన మావోయిస్టు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనం అయ్యిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలతో కోర్టులో తమ వాదనలను వినిపించారు.
మరోవైపు ప్రభాకర్ రావు కూడా తన న్యాయవాది ద్వారా అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పదని స్పష్టమైంది. (ఏజెన్సీలు)