హైదరాబాద్: రైల్వే నిలయం ఆడిటోరియంలో నేడు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే ఉత్సవాలు జరిగింది. ముఖ్యఅతిథి పిసిపిఓ శ్రీ కిషోర్ బాబు మాట్లాడుతూ… AIRRF సేవలను కొనియాడారు. రైల్వే పెన్షనర్లకు ఏ సమస్య వచ్చినా సహాయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమని చెప్పారు.
మరో అతిథి శ్రీ శేష సాయి మాజీ పిసిపిఓ మరియు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తమ సోహార్ధ సందేశం ఇచ్చారు. పెన్షన్ ఫిష్ స్టేషన్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సంఘాలన్నీ ప్రభుత్వాలు పైన ఒత్తిడి వేయాలని కోరారు.
Chief guest PCPO Kishore Babu Speaking
శ్రీ కేఎం స్వామి జాయింట్ జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ అఖిల భారత పెన్షనర్స్ డే పూర్వపరాలను చెప్పారు. ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ కార్యదర్శి శ్రీ కృష్ణమోహన్ మాట్లాడుతూ పెన్షనర్స్ సంఘాలు అన్ని కలిసి అవసరం ఉందని చెప్పారు. దేశంలోని పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు.
AIRRF అఖిలభారత అధ్యక్షులు సాగరం శ్రీధర్ ప్రధాన ఉపన్యాసం ఇస్తూ దేశంలో పెన్షనర్స్ ఎదుర్కొంటున్న వాళ్లను ముందు ఉంచారు. ఈ సంఘం అఖిల భారతీయ స్థాయిలో చేసే కృషిని వివరించారు.
AIRRF దక్షిణ మధ్య రైల్వే విభాగం చేస్తున్న కార్యకలాపాలను వివరించారు. పాట్రన్లు డివి రావు గారు మరియు ప్రభుత్వం గారు సందేశం ఇచ్చారు. సభానంతరం 80 సంవత్సరాలు వయస్సు దాటిన పెన్షనర్లను సత్కరించడం జరిగింది. శివకుమార్ గారు అధ్యక్షత వహించగా కృష్ణకుమారి గారు వందన సమర్పణం ఇచ్చారు.