హైదరాబాద్ : ఖైరతాబాద్ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ప్రజానేత పి. జనార్ధన్ రెడ్డి 18 వ వర్ధంతి సందర్భంగా పీజేఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ , కార్పొరేటర్ విజయ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పీజేఆర్ 18 వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నను.
హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతూ కృష్ణ, గోదావరి జలాలు తరలించడంలో పీజేఆర్ కృషి ఎనలేనిది. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి గా సమీక్షా సమావేశాల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన చేసిన సేవలు, హైదరాబాద్ తాగునీటికి ఆయన పాత్ర ను గుర్తు చేసుకుంటాం.
Also Read-
పోతిరెడ్డి పాడు దోపిడిని తెలంగాణ ఉద్యమకారుడిగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కార్మిక నాయకుడిగా ఎనలేని సేవ చేశారు. నగరంలో గుడిసెలను ఏర్పాటు చేయడంలో కాకా గుడిసెల వెంకట్ స్వామి కృషి చేస్తే అనేక బస్తీలు ఏర్పాటు చేయడంలో పీజేఆర్ పాత్ర మరువలేనిది.
