हैदराबाद/नई दिल्ली: नियंत्रण रेखा (LOC) पर पाकिस्तान की सेना ने गोलीबारी शुरू की। भारतीय सेना ने इसका करारा जवाब दिया। इस घटना में कोई हताहत नहीं हुआ है। भारतीय सेना के अधिकारी आगे की जानकारी जुटा रहे हैं। सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदी जल्द ही श्रीनगर और उधमपुर के लिए रवाना हो हरे हैं।
रक्षा अधिकारियों के अनुसार, वह कश्मीर घाटी में तैनात सेना के वरिष्ठ कमांडरों और अन्य सुरक्षा एजेंसियों के अधिकारियों से मिलेंगे। वह घाटी में मौजूदा सुरक्षा स्थिति का जायजा लेंगे। साथ ही, वह नियंत्रण रेखा पर पाकिस्तान सेना द्वारा किए जा रहे संघर्ष विराम उल्लंघन के प्रयासों की समीक्षा करेंगे।
यह भी पढ़ें-
दूसरी ओर स्थानीय लोग इस गोलीबारी की घटना से भयभीत है। आपको बता दें कि पहलगाम आतंकी हमले के बाद भारत सरकार ने पाकिस्तान के खिलाफ कड़े कदम उठाये है।
इसी क्रम में लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी पहलगाम आतंकी हमले में घायल हुए लोगों का हाल जानने के लिए आज जम्मू-कश्मीर जाएंगे। उधर जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकी हमले के बाद बिहार के मधुबनी से प्रधानमंत्री नरेंद्र मोदी ने सख्त संदेश दिया है।
पीएम मोदी ने कहा कि आतंकियों को कल्पना से बड़ी सजा देंगे। भारत ने लगभग सभी जी20 सदस्य देशों के राजनयिकों और अपने रणनीतिक साझेदारों को पहलगाम आतंकी हमले और सीमा पार आतंकवाद से इसके संबंध के बारे में जानकारी दी।(एजेंसियां)
జమ్ము కాశ్మీర్ ఎల్వోసీ దగ్గర పాక్ కాల్పులు
హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, దాయాది పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ దుందుడుకు చర్యలతో ఇరు దేశాలు మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. భారత్-పాక్ బార్డర్ ఎల్వోసీ దగ్గర కూడా పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక పోస్టులపై ఏక పక్షంగా కాల్పులకు దిగారు. గురువారం (ఏప్రిల్ 24) అర్థరాత్రి నుంచి ఎల్వోసీ దగ్గర ఒక్కసారిగా పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
పాక్ సైనికులు కవ్వింపు చర్యలతో భారత జవాన్లు వెంటనే అప్రమత్తమయ్యారు. పాక్ సైనికులకు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. పాక్ సైనికుల కాల్పులను ధీటుగా తిప్పికొట్టారు. పాక్ సైనికులు ఉన్నఫళంగా కాల్పులు మొదలుపెట్టడంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) దగ్గర హై టెన్షన్ నెలకొంది. రెండు దేశాల బార్డర్ల వద్ద భారీగా బలగాలను మెహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ‘‘పాకిస్తాన్ సైన్యం ఎల్వోసీ వెంబడి ఉన్న భారత పోస్టులపై చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. మా దళాలు కూడా స్పందించాయి. భారత వైపు నుండి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని ఒక అధికారి వెల్లడించారు.
కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో దాయాది పాక్, భారత్ మధ్య వివాదం మొదలైంది. (ఏజెన్సీలు)
