हैदराबाद: AITUC तेलंगाना मोटर ट्रांसपोर्ट ड्राइवर्स यूनियन के अध्यक्ष बैरागोनी राजू ने तेलंगाना में ओला, उबर और रैपिडो सेवाओं पर प्रतिबंध लगाने की मांग की है। लाखों स्थानीय ऑटो और कैब चालक इससे अपनी जीविका खो रहे हैं। परिणामस्वरूप उनके परिवार सड़क पर आ रहे हैं।
बैरागोनी राजू हैदराबाद के हिमायत नगर में आयोजित एक बैठक में बोल रहे थे। उन्होंने कहा कि शमशाबाद एयरपोर्ट पर ओला और उबर कंपनियां लूटपाट कर रही हैं। उन्होंने शिकायत की कि पीली नंबर प्लेट वाले वाहनों पर हवाईअड्डे में प्रवेश करने से रोकने के लिए बाउंसरों से हमला किया जा रहा है। उन्होंने सवाल किया कि सरकार और जीएमआर कंपनी बिना रोड टैक्स वाली सफेद प्लेट वाली गाड़ियों को टैक्सी के तौर पर चलने की इजाजत क्यों दे रही है।
उन्होंने कहा कि कमर्शियल रोड टैक्स देने वाली टैक्सियों को रोकने से कैब चालकों को नुकसान हो रहा है। टैक्स न देकर सरकार को नुकसान पहुंचा रही ओला और उबर ने सफेद नंबर प्लेट वाले वाहनों को जब्त कर कार्रवाई करने की मांग की। उन्होंने कहा कि ओला, उबर और रैपिडो ऑटो और कैब चालकों से 35 फीसदी कमीशन वसूलते हैं। उन्होंने मंत्री केटीआर से आग्रह किया कि वे ओला और उबर कंपनियों से चर्चा करें और उन्हें कमीशन की लूट से बचाये।
Motor Transport Drivers Union: తెలంగాణలో ఓలా, ఉబర్, రాపిడో సేవలపై నిషేధం విధించాలి
హైదరాబాద్: తెలంగాణలో ఓలా, ఉబర్, రాపిడో సేవలపై నిషేధం విధించాలని ఏఐటీయూసీ తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బైరగోని రాజు డిమాండ్ చేశారు. వీటితో లక్షలాది మంది స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని, ఫలితంగా వారి ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో నిర్వహించిన సమావేశంలో బైరగోని రాజు మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓలా, ఉబర్ సంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని తెలిపారు. ఎల్లో నంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ను ఎయిర్ పోర్ట్ లోకి రానీయకుండా బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నాయని వాపోయారు. రోడ్ ట్యాక్స్ లేని వైట్ ప్లేట్స్ వెహికల్స్ ను ట్యాక్సీలుగా నడపడానికి ప్రభుత్వం, జీఎంఆర్ సంస్థ ఎందుకు అనుమతిస్తున్నాయని ప్రశ్నించారు.
కమర్షియల్ రోడ్ ట్యాక్స్ కట్టిన ట్యాక్సీలను అడ్డుకోవడం వల్ల క్యాబ్ డ్రైవర్లు నష్టపోతున్నారని తెలిపారు. ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న ఓలా, ఉబర్ వైట్ నంబర్ ప్లేట్ల వెహికల్స్ను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల నుంచి ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు 35% కమీషన్ వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఓలా, ఉబర్ సంస్థలతో మంత్రి కేటీఆర్ చర్చించి కమీషన్ దోపిడీ నుంచి తమను కాపాడాలని కోరారు. (ఏజెన్సీలు)