हैदराबाद: तेलुगु देशम पार्टी के राष्ट्रीय अध्यक्ष नारा चंद्रबाबू नायडू ने कहा है कि तेलुगु राज्य के महान अभिनेता और संयुक्त आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री स्वर्गीय एनटीआर को भारत रत्न पुरस्कार दिए जाने तक संघर्ष जारी रहेगा।
चंद्रबाबू ने केंद्र सरकार से एनटीआर को भारत रत्न देने की मांग की। एनटीआर एक व्यक्ति नहीं बल्कि एक शक्ति है। जब तक तेलुगु राज्य मौजूद है, एनटीआर उनके दिलों में रहेगा। हर किसी को एनटीआर से पहले और उनके बाद तेलुगु लोगों को मिली पहचान के बारे में सोचने की सलाह दी है।
उन्होंने कहा कि जब एनटीआर नेशनल फ्रंट के अध्यक्ष थे, तब डॉ. बीआर अंबेडकर को भारत रत्न देने की मांग की थी। यह एनटीआर की स्पूर्ति रही है। एनटीआर का शताब्दी समारोह शनिवार को हैदराबाद के केपीएचबी कैत्लापुर मैदान में भव्यता के साथ आयोजित किया गया।
चंद्रबाबू नायुडु बतौर मुख्य अतिथि मौजूद रहे। इस अवसर पर जय एनटीआर ने वेबसाइट लॉन्च किया। चंद्रबाबू ने खुलासा किया कि शताब्दी समारोह समिति ने अगले साल हैदराबाद शहर में 100 फीट की मूर्ति स्थापित करने का फैसला किया है।
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: జయహో ఎన్టీ రామారావు
హైదరాబాద్: మహా నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు వచ్చేదాకా తెలుగు జాతి పోరాడుతుందని, ఆయనకు పురస్కారం సాధించి తీరతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వ్యక్తి కాదు శక్తి అని తెలుగు జాతి ఉన్నంతవరకు, వారి గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ముందు, ఆయన తర్వాత తెలుగువారికి వచ్చిన గుర్తింపు గురించి అందరూ ఆలోచించాలని సూచించారు.
ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నప్పుడే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ప్రకటించారని పేర్కొంటూ, ఇదీ ఎన్టీఆర్ స్ఫూర్తి అని అన్నారు. శనివారం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు.
వీటికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. జై ఎన్టీఆర్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది హైదరాబాద్ శివారులో వంద అడుగుల విగ్రహం ఏర్పాటుకు శతజయంతి ఉత్సవ కమిటీ సంకల్పించిందని చంద్రబాబు వెల్లడించారు.
‘‘మే 28న అమెరికాలో కూడా తెలుగు హెరిటేజ్ డే నిర్వహిస్తున్నారంటే అది తెలుగు జాతికి ఎన్టీఆర్ తెచ్చిన గుర్తింపు. తెలుగు జాతి ఆస్తి, వారసత్వం ఎన్టీఆర్. ఆ మూడక్షరాలు ఓ మహా శక్తి. ఆయన తెలుగు జాతికి స్ఫూర్తి. ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఇంట్లో ఆయన ఫొటో పెట్టి నివాళులర్పించాలి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. మహానాడు సందర్భంగా రాజమండ్రిలో శతజయంతి ఉత్సవాలు కొనసాగిస్తామని తెలిపారు.
‘‘ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు. లంచాలు తీసుకోవడం నచ్చక సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ రంగానికి వెళ్లారు. సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలను మరెవరూ వేయలేదు. ఎన్టీఆర్ మళ్లీ పుడితేనే అది సాధ్యం. రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం ఎన్టీఆర్ జీవితంలో నాలుగో అధ్యాయం. ఇప్పుడు దేశంలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఎప్పుడో శ్రీకారం చుట్టారు. యుగపురుషుడిగా నిలిచిపోయారు’’ అని చంద్రబాబు అన్నారు.