बिजली खरीद समझौतों के अनियमितताओं के आरोपों की जांच आयोग के सामने रघु और कोदंडराम ने किया दूध का दूध और पानी का पानी

हैदराबाद : विद्युत जेएसी के अध्यक्ष रघु ने कहा कि पिछली बीआरएस सरकार के दौरान छत्तीसगढ़ के साथ किए गए बिजली खरीद समझौते को विद्युत नियामक आयोग (ईआरसी) से मंजूरी नहीं मिल सकी। उन्होंने कहा कि तत्कालीन सरकार द्वारा किये गये प्रस्तावों को ही ईआरसी ने मंजूरी दी है और समझौते को अभी तक मंजूरी नहीं मिली है। सरकार ने छत्तीसगढ़ के साथ बिजली खरीद समझौतों और यादाद्री और भद्राद्री संयंत्रों के निर्माण में अनियमितताओं के आरोपों की जांच के लिए न्यायमूर्ति नरसिम्हा रेड्डी की अध्यक्षता में एक न्यायिक आयोग का गठन किया है। हालाँकि, केसीआर ने आयोग को लिखे पत्र में कहा कि लिखा छत्तीसगढ़ के साथ किए गए बिजली खरीद समझौते को ईआरसी मंजूरी दे दी है और इसमें न्यायिक जांच की कोई आवश्यकता नहीं है। इस विषय में आयोग के अध्यक्ष के पास कोई जांच करने का अधिकार क्षेत्र नहीं है। इसीलिए अध्यक्ष जांच प्रक्रिया से हट जाये।

इसी पृष्ठभूमि में आयोग केसीआर के पत्र की समीक्षा कर रहा है। केसीआर द्वारा बताए गए बिंदुओं का तथ्यों से मिलान करने के लिए आयोग के अध्यक्ष जस्टिस नरसिम्हा रेड्डी ने बिजली खरीद समझौतों और दस्तावेजों का गहनता से अध्ययन किया और संबंधित लोगों से भी बात की। विद्युत जेएसी के अध्यक्ष रघु और टीजेएस प्रमुख प्रोफेसर कोदंडराम ने मंगलवार को आयोग के समक्ष अपनी दलीलें पेश कीं। रघु ने बिजली खरीद समझौतों और बिजली संयंत्रों के निर्माण पर एक पावर प्वाइंट प्रस्तुति दी। उन्होंने सबूतों के साथ खुलासा किया कि छत्तीसगढ़ के साथ मौजूदा समझौते को ईआरसी ने मंजूरी नहीं दी है।

विद्युत जेएसी के अध्यक्ष रघु ने कहा कि छत्तीसगढ़ के साथ बिजली समझौते से तेलंगाना को करोड़ों रुपये का नुकसान हुआ है। जस्टिस नरसिम्हा रेड्डी आयोग के समक्ष उनकी दलीलें सुनने के बाद उन्होंने बीआरके भवन में मीडिया से बात की। रघु ने आगे कहा कि छत्तीसगढ़ के साथ समझौते को ईआरसी ने मंजूरी नहीं दी है। दोनों राज्यों के डीआईएससी ने ही एमओयू किया है। तत्कालीन सरकार ने प्रतिस्पर्धी बोली नहीं लगाई और भारी नुकसान हुआ। रघु ने बताया, “अगर छत्तीसगढ़ के साथ 1000 मेगावाट की आपूर्ति के लिए समझौता हुआ था, तो समझौते के अनुसार कभी भी पूरी बिजली की आपूर्ति नहीं की है। परिणामस्वरूप, विकल्प के रूप में बिजली खरीदनी पड़ी। परिणामस्वरूप, 2,600 करोड़ का नुकसान हुआ”। उन्होंने कहा कि भद्राद्री और यदाद्री बिजलीघरों के बारे में उनके पास जो जानकारी थी, वह आयोग को दे दी है। यदाद्रि पावर प्लांट, जिसे तीन साल में पूरा होना था, नौ साल में भी पूरा नहीं हुआ। भद्राद्रि थर्मल पावर प्लांट में सब-क्रिटिकल तकनीक राज्य सरकार की पसंद नहीं है। बीएचईएल ने राज्य सरकार पर सब-क्रिटिकल तकनीक थोप दी है।

यह भी पढ़ें-

बीएचईएल ने 2010 में निर्मित सब-क्रिटिकल टेक्नोलॉजी टर्बाइन और बॉयलर को कुछ वर्षों के बाद सरकार पर थोप दिया। दूसरी ओर, पर्यावरणीय पहलुओं पर विचार किए बिना भद्राद्री संयंत्र शुरू कर दिया गया। अगर गोदावरी में बाढ़ बढ़ती है तो इसका असर पावर प्लांट पर पड़ेगा। इसमें तकनीकी पहलुओं को ध्यान में नहीं रखा गया है। यदाद्रि पावर प्लांट कोयला उत्पादन क्षेत्र से बहुत दूर है। इसलिए यह परिवहन शुल्क का बोझ पड़ेगा। “2016 में हमने समस्याओं को सरकार के ध्यान में लाया। हमने अपनी आपत्तियों की ओर नियामक आयोग का भी ध्यान दिलाया है। फिर आयोग ने सात साल तक पीपीए नहीं किया। छत्तीसगढ़ संधि से तीन प्रकार की हानि हुई। पीजीसीएल के साथ कॉरिडोर समझौते और बिजली का भुगतान नहीं होने से 635 करोड़ का नुकसान हुआ। भद्राद्रि संयंत्र के साथ 25 वर्षों में 9,000 करोड़ रुपये और यदाद्री संयंत्र के साथ कोयले के परिवहन से 1,600 करोड़ रुपये से अधिक का नुकसान होगा।

टीजेएस प्रमुख कोदंडराम ने कहा कि बीआरएस सरकार के दौरान लिए गए सभी गलत फैसलों को सही ठहराने की केसीआर कोशिश कर रहे हैं। जस्टिस नरसिम्हा रेड्डी आयोग के समक्ष उनकी दलीलें सुनने के बाद उन्होंने बीआरके भवन में मीडिया से बात की। कोदंडराम ने कहा कि पिछली बीआरएस सरकार ने विकास के नाम पर नियमों का उल्लंघन किया। केसीआर ने केंद्र सरकार की बात सुने बिना जल्दबाजी में फैसला लिया और छत्तीसगढ़ के साथ बिजली समझौता कर लिया। सरकार को अपनी शक्तियों का प्रयोग केवल जन कल्याण के लिए करना चाहिए। विकास आपसी लाभ के बारे में नहीं है। पिछली सरकार की जल्दबाजी के कारण ट्रांसको और जेनको पर 81 हजार करोड़ का कर्ज हो गया। पिछले साल बाढ़ के कारण भद्राद्री संयंत्र को बिजली उत्पादन बंद करना पड़ा था। सवाल किया कि यदि पोलावरम पूरा हो जाता है और भविष्य में गोदावरी का जल स्तर बढ़ जाता है तो भी क्या भद्राद्रि संयंत्र को बचाया जा सकता है? भद्राद्री संयंत्र न्यूनतम सावधानी बरते बिना बनाया गया। उन्होंने सुझाव दिया कि लोगों को पिछली सरकार के फैसलों के कारण जिम्मेदार लोगों के खिलाफ आपराधिक कार्रवाई करने में संकोच नहीं करना चाहिए। केसीआर ने उस दिन खर्च कम करने की कोशिश नहीं की। कुछ लोगों को फायदा पहुंचाने के लिए यह फैसले लिए गये। अब भागने की कोशिश कर रहे हैं।

చత్తీస్​గఢ్ కరెంట్ ఒప్పందానికి, ఈఆర్సీ ఆమోదం అబద్ధం

హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చత్తీస్​గఢ్ తో చేసుకున్న కరెంట్ కొనుగోలు ఒప్పందానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ (ఈఆర్సీ) నుంచి ఆమోదం లభించదలేని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు. దీనికి సంబంధించి నాటి ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్​కు మాత్రమే ఈఆర్సీ ఆమోదం లభించిందని, అగ్రిమెంట్​కు ఇంకా ఆమోదం లభించలేదని చెప్పారు. చత్తీస్​గఢ్​తో కరెంటు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి ​ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కమిషన్​కు లేఖ రాసిన కేసీఆర్ చత్తీస్​గఢ్​తో చేసుకున్న విద్యుత్ ​కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదించిందని, ఇక న్యాయ విచారణ అవసరమే లేదని, ఈ విషయంలో కమిషన్​ చైర్మన్​కు విచారణార్హత లేనందున ఆయన తప్పుకోవాలని అందులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ లెటర్​పై కమిషన్ ​సమీక్ష జరుపుతున్నది. కేసీఆర్ ​ప్రస్తావించిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చే క్రమంలో కమిషన్ చైర్మన్​జస్టిస్ ​నర్సింహారెడ్డి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులతోనూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు. పవర్​ పర్చేజ్​అగ్రిమెంట్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం జరిగిన తీరుతెన్నులపై రఘు పవర్ పాయింట్​ప్రజంటేషన్​ఇచ్చారు. చత్తీస్​గఢ్​తో చేసుకున్న కరెంట్ ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం లభించలేదని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు.

చత్తీస్​గఢ్​తో విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రానికి రూ.వేల కోట్ల నష్టం జరిగిందని విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు తన వాదనలు వినిపించిన ఆయన అనంతరం బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. చత్తీస్​గఢ్​తో జరిగిన ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం లభించలేదని రఘు తెలిపారు. ఇరు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఎంవోయూ చేసుకున్నాయని చెప్పారు. నాటి ప్రభుత్వం కాంపిటేటివ్ బిడ్డింగ్​కు వెళ్లకపోవడంతో భారీగా నష్టం జరిగిందన్నారు. ‘‘చత్తీస్​గఢ్​తో వెయ్యి మెగావాట్ల సరఫరాకు ఒప్పందం జరిగితే, ఆ రాష్ట్రం ఏనాడూ ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో కరెంట్ సప్లై చెయ్యలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా విద్యుత్​ కొనుగోళ్లు చేపట్టాల్సి వచ్చింది. ఫలితంగా 2,600 కోట్ల నష్టం వాటి ల్లింది” అని వివరించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాలపై తన వద్ద ఉన్న సమచారాన్ని కమిషన్​కు అందజేశానని తెలిపారు. ‘‘మూడేండ్లలో పూర్తి కావాల్సిన యాదాద్రి పవర్ ప్లాంట్ తొమ్మిదేండ్లయినా పూర్తి కాలేదు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్​లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వ చాయిస్ కాదు. రాష్ట్ర ప్రభుత్వంపై సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ ఈఎల్ రుద్దింది.

2010లో తయారు చేసిన సబ్ క్రిటికల్ ​టెక్నాలజీ టర్బైన్లు, బాయిలర్లను ఆరేండ్ల తర్వాత ప్రభుత్వంపై బలవంతంగా బీహెచ్ఈఎల్ రుద్దింది. మరోవైపు పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలుపెట్టారు. గోదావరిలో వరద ఎక్కువైతే పవర్ ప్లాంట్​పై ప్రభావం పడుతుంది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ బొగ్గు ఉత్పత్తి ప్రాంతానికి దూరంగా ఉండడంతో రవాణా చార్జీల భారం పడుతుంది” అని తెలిపారు. ‘‘2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మా అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. అప్పుడే కమిషన్ పీపీఏ చేయమంటే ఏడేండ్లుగా చెయ్యలేదు. చత్తీస్​గఢ్ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయి. పీజీసీఎల్​తో కారిడార్ ఒప్పందం చేసుకుని కరెంటు తీసుకోకపోవడం వల్ల 635 కోట్ల నష్టం వచ్చింది. భద్రాద్రి ప్లాంట్​తో 25 ఏండ్లలో 9వేల కోట్లు, యాదాద్రి ప్లాంట్​తో ఒక్క బొగ్గు రవాణా ద్వారానే 1,600 కోట్లకు పైగా నష్టం జరుగుతుంది” అని వివరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నింటినీ కేసీఆర్ సమర్థించుకునే ప్రయ త్నం చేస్తున్నారని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు తన వాదనలు వినిపించిన ఆయన అనంతరం బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించిందని కోదండరాం అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా వినకుండా కేసీఆర్ తొందరపాటు నిర్ణయం తీసుకుని, చత్తీస్​గఢ్​తో విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసమే ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించాలి. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదు.

గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌‌కో, జెన్‌‌కోలకు 81 వేల కోట్ల అప్పులు అయ్యాయి. పోయినేడాది వరదలు వస్తే భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. పోలవరం పూర్తయినా, భవిష్యత్తులో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగినా భద్రాద్రి ప్లాంటును కాపాడుకోగలమా? కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భద్రాద్రి ప్లాంట్ నిర్మించారు” అని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల జనం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని, దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు వెనుకాడవద్దని సూచించారు. ‘‘ఆనాడు కేసీఆర్ ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయలేదు. కొద్దిమందికే లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడేమో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని కోదండరాం అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X