हैदराबाद: तेलंगाना में गोदावरी और कृष्णा समेत नौ नदियां प्रदूषण की चपेट में आ गये हैं। स्टेट ऑफ इंडियाज एनवायरनमेंट 2023 की रिपोर्ट में यह खुलासा हुआ है। 42 जगहों पर नदियों के पानी की गुणवत्ता की जांच की गई, जबकि 37 जगहों पर पानी अत्यधिक प्रदूषित पाया गया। सेंटर फॉर साइंस एंड एनवायरनमेंट नामक एक निजी संस्था ने यह रिपोर्ट जारी की है।
इस रिपोर्ट के अनुसार, ग्रीन कवर सुधार और नगरपालिका अपशिष्ट प्रबंधन में अच्छा प्रदर्शन करने के बाद तेलंगाना समग्र रैंकिंग में पहले स्थान पर रहा है। रिपोर्ट में कहा गया है कि नदियों के प्रदूषण, भूजल के अत्यधिक बढ़ने और जल स्रोतों को बेकार रखने के मामले में तेलंगाना का प्रदर्शन अच्छा नहीं है।
रिपोर्ट में कहा कि तेलंगाना में 19 प्रतिशत जल निकाय (जैसे तालाब और तालाब) बेकार हो गए हैं। कृष्णा, मूसी, करकवागु, किन्नरसानी, मानेरू, मंजीरा, मुन्नेरु, नक्कावगु और गोदावरी नदियां प्रदूषण से प्रभावित हुई हैं। यह बात सामने आई है कि तेलंगाना नदियों के संरक्षण में विफल हो गया है।
वैज्ञानिकों ने देशभर की 603 नदियों के पानी की गुणवत्ता की जांच करने पर पाया है कि 279 नदियों का पानी कम से कम नहाने लायक नहीं है। रिपोर्ट में कहा गया है कि देश में वायु प्रदूषण के कारण मनुष्य की जीवन प्रत्याशा कम हो रही है।
अनुमान है कि वायु प्रदूषण के कारण देश के ग्रामीण क्षेत्रों में रहने वालों की जीवन प्रत्याशा 5 वर्ष 2 महीने कम हो गई है, जबकि शहरी क्षेत्रों में रहने वालों की जीवन प्रत्याशा 4 वर्ष और 5 महीने कम हो गई है। रिपोर्ट में कहा गया है कि ग्रामीण तेलंगाना में लोगों की जीवन प्रत्याशा में 2 साल 9 महीने और शहरी क्षेत्रों में 3 साल की कमी आई है। उल्लेखनीय है कि तेलंगाना कृषि उत्पादन, सार्वजनिक स्वास्थ्य और मानव विकास सूचकांक के मामले में क्रमशः 19वें, 13वें और चौथे स्थान पर है।
తెలంగాణలో 9 నదులు కలుషితం మరి దేశంలో…
హైదరాబాద్: తెలంగాణలో గోదావరి, కృష్ణ సహా 9 నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. నదుల్లో నీటి నాణ్యతను 42 చోట్ల పరిశీలించగా, అందులో 37 చోట్ల విపరీతమైన కాలుష్యంతో కూడిన నీళ్లు ఉన్నాయని స్టేట్స్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023 రిపోర్ట్ వెల్లడించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే ప్రైవేటు సంస్థ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, గ్రీన్ కవర్ ఇంప్రూవ్‌మెంట్, మున్సిపల్ వేస్ట్ మేనెజ్‌మెంట్‌లో మంచి పనితీరు కనబర్చి ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. నదుల కాలుష్యం, గ్రౌండ్ వాటర్ అధికంగా తోడడం, నీటి వనరులను నిరుపయోగంగా ఉంచడం వంటి అంశాల్లో తెలంగాణ పనితీరు బాగోలేదని రిపోర్ట్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో 19 శాతం వాటర్ బాడీస్ (చెరువులు, కుంటలు వంటివి) నిరుపయోగంగా మారాయని తెలిపారు. కృష్ణ, మూసీ, కరకవాగు, కిన్నెరసాని, మానేరు, మంజీర, మున్నేరు, నక్కవాగు, గోదావరి నదులు కాలుష్యం బారిన పడ్డాయని చెప్పింది. నదుల సంరక్షణలో గతంలో కంటే ప్రస్తుతం తెలంగాణ వెనుకబడిందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 603 నదుల్లో నీటి నాణ్యతను పరిశీలించగా, 279 నదుల్లోని నీళ్లు కనీసం స్నానానికి కూడా పనికిరాకుండా ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. దేశంలో వాతావరణ కాలుష్యం వల్ల మానవుల జీవితకాలం తగ్గుతోందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
గాలి కాలుష్యం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఆయుష్షు 5 ఏండ్ల 2 నెలలు తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆయుష్షు 4 ఏండ్ల 5 నెలలు తగ్గిందని అంచనా వేశారు. తెలంగాణ రూరల్‌లో రెండేండ్ల 9 నెలలు, అర్బన్‌లో మూడేండ్ల మేర ప్రజల జీవిత కాలం తగ్గిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి, పబ్లిక్ హెల్త్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో తెలంగాణ వరుసగా 19, 13, 4వ స్థానాల్లో నిలవడం గమనార్హం. (ఏజెన్సీలు)