हैदराबाद: तमिलनाडु की मदुरै कोर्ट ने सोमवार को पुलिस की हिरासत मौत मामले में एक सनसनीखेज फैसला सुनाया। छह साल पहले इस मामले ने पूरे देश में हड़कंप मचा दी थी। कोर्ट ने हिरासत में पिता-पुत्र की मौत के लिए जिम्मेदार 9 पुलिसवालों को मौत की सज़ा सुनाई।
गौरतलब है कि 19 जून 2020 को व्यापारी पी. जयराज और उसके बेटे बेनिक्स को कोरोना लॉकडाउन के दौरान नियमों के खिलाफ मोबाइल की दुकान खोलने के आरोप में थूथुकुडी जिले की सतानकुलम पुलिस ने गिरफ्तार किया था। पूरी रात थाने में बुरी तरह टॉर्चर किए जाने के बाद, गंभीर रूप से घायल दोनों की कुछ ही दिन में मौत हो गई। हालांकि, जांच में पता चला कि लॉकडाउन के दौरान दुकान नहीं खोली गई थी।

देश भर में विरोध प्रदर्शन और मद्रास हाई कोर्ट के आदेश के बाद सीबीआई ने मामले की जांच शुरू की। इस मामले में शामिल एक इंस्पेक्टर और दो सब-इंस्पेक्टर समेत 10 पुलिस को गिरफ्तार किया। उनके खिलाफ हत्या का मामला दर्ज किया। एक महिला कांस्टेबल ने अपनी गवाही में कहा कि पिता और बेटे को पूरी रात बेरहमी से पीटा गया और टेबल और डंडों पर खून के धब्बे लगे पाये गये थे। गवाह और सबूत सब इस मामले में अहम साबित हुई।

सीबीआई की जांच में यह भी पता चला कि सतानकुल पुलिस ने सबूतों से छेड़छाड़ करने के लिए स्टेशन का सीसीटीवी फुटेज नष्ट कर दिया था। लंबी जांच और सबूतों की जांच करने के बाद कोर्ट ने इस मामले में शामिल 9 पुलिसवालों को मौत की सज़ा सुनाई।
Also Read-
తండ్రీకొడుకుల లాకప్ డెత్, 9 మంది పోలీసులకు మరణశిక్ష
హైదరాబాద్ : ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే.. 2020 జూన్ 19న కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ షాపు తెరిచారనే ఆరోపణలతో వ్యాపారి పి. జయరాజ్, అతడి కుమారుడు బెనిక్స్లను తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం పోలీసులుఅరెస్ట్ చేశారు. స్టేషన్లో రాత్రంతా వారిని పాశవికంగా చిత్రహింసలకు గురిచేయడంతో, తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచారనేది అబద్దమని విచారణలో తేలింది.
దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులను అరెస్ట్ చేసి హత్య కేసులు నమోదు చేసింది. తండ్రీకొడుకులను రాత్రంతా దారుణంగా కొట్టారని, బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది.
అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సత్తాంకుళం పోలీసులు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని సైతం మాయం చేసినట్లు సీబీఐ విచారణలో నిర్ధారణ అయింది. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ దారుణానికి పాల్పడిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. (ఏజెన్సీలు)
