हैदराबाद : भारत में 2024 कैलेंडर वर्ष Q1 अर्थात जनवरी-मार्च तिमाही में मकानों की कीमत शीर्ष-8 प्रमुख शहरों में औसतन 10 प्रतिशत बढ़ीं हैं। कहा जा रहा है कि आवासीय अचल संपत्ति पर सकारात्मक धारणा की पृष्ठभूमि में दरें बढ़ रही हैं। इस बात का खुलासा प्रमुख रियल एस्टेट कंपनी क्रेडाई (CREDAI) और कोलियर्स की रिपोर्ट से हुआ है।
बेंगलुरु में शहर में पिछले साल की तुलना में मकानों की कीमतों में सबसे ज्यादा 19 फीसदी की बढ़ोतरी देखी गई। उल्लेखनीय है कि मकानों की कीमतों के मामले में यह भारत के पहले 8 शहरों में सबसे ज्यादा है।
बेंगलुरु में ही पेरीफेरी एंड आउटर ईस्ट माइक्रो मार्केट में मकानों की कीमतों में 32 फीसदी की भारी बढ़ोतरी हुई है। उसके बाद पेरीफेरी एंड आउटर नॉर्थ मार्केट में औसतन 18 प्रतिशत की वृद्धि देखी गई। रिपोर्ट में कहा गया है कि विशाल इकाइयों के संबंध में, व्हाइटफील्ड और केआर पुरम जैसे प्रमुख आईटी केंद्रों में 3बीएचके और 4बीएचके घरों की मांग अधिक है।
बेंगलुरु के बाद दिल्ली-एनसीआर क्षेत्र का स्थान रहा है, जहां मकानों की कीमतें 16 प्रतिशत बढ़ीं है। यहां सालाना आधार पर पिछले साल की तुलना में औसतन 16 फीसदी की बढ़ोतरी हुई है। खासकर द्वारका एक्सप्रेसवे में 23 फीसदी की बढ़ोतरी हुई है।
हैदराबाद महानगर में पिछले साल जनवरी-मार्च की तुलना में पहली तिमाही में मकानों की कीमतें औसतन 9 प्रतिशत बढ़ी हैं। अक्टूबर-दिसंबर 2023 की तुलना में अब सिर्फ 2 फीसदी की बढ़ोतरी देखी गई है।
अहमदाबाद पहला स्थान है जहां पिछली तिमाही की तुलना में मौजूदा तिमाही में कीमतें बढ़ी हैं। यहां 7 फीसदी तक दरें बढ़ गई हैं। उधर कोलकाता में मकानों की कीमतें 2 फीसदी तक कम हो गई हैं। चेन्नई में कोई बदलाव नहीं हुआ है। साल-दर-साल आधार के अनुसार मकानों की दरों में 4 फीसदी की वृद्धि हुई है।
హైదరాబాద్‌లో రేట్లు లిస్ట్
హైదరాబాద్ : భారత్‌లో 2024 క్యాలెండర్ ఇయర్ Q1 అంటే జనవరి- మార్చి త్రైమాసికంలో ఇళ్ల ధరలు టాప్-8 ప్రధాన నగరాల్లో సగటున 10 శాతం పెరిగాయి. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌పై పాజిటివ్ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలోనూ ఇలా రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ.. క్రెడాయ్ (CREDAI) & కొలియర్స్ రిపోర్ట్ వెల్లడించింది.
బెంగళూరు నగరంలోనే అత్యధికంగా గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇళ్ల ధరలు 19 శాతం మేర పెరిగాయి. ఇళ్ల ధరల పరంగా భారత్‌లోని తొలి 8 నగరాల్లో ఇక్కడే ఎక్కువ కావడం విశేషం.
బెంగళూరులోనే పెరిఫెరీ అండ్ అవుటర్ ఈస్ట్ మైక్రో మార్కెట్‌లో ఇంకా భారీ స్థాయిలో 32 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి. ఆ తర్వాత పెరిఫెరీ అండ్ అవుటర్ నార్త్ మార్కెట్లో సగటున 18 శాతం వృద్ధి కనిపించింది. స్పేసియస్ యూనిట్లకు సంబంధించి కీలక ఐటీ హబ్స్ వైట్‌ఫీల్డ్, కేఆర్ పురం వంటి చోట్ల 3BHK, 4BHK ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉందని రిపోర్ట్ తెలిపింది.
బెంగళూరు తర్వాతి స్థానంలో ఢిల్లీ-NCR రీజియన్‌లో ఇళ్ల ధరలు 16 శాతం పెరిగి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన సంవత్సరం కిందటితో పోలిస్తే సగటున 16 శాతం పెరగ్గా ముఖ్యంగా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే లో 23 శాతం పెరిగాయి.
హైదరాబాద్ మహానగరంలో కిందటేడాది జనవరి- మార్చి సమయంతో పోలిస్తే ఇప్పుడు Q1లో ఇళ్ల ధరలు సగటున 9 శాతం మేర పుంజుకున్నాయి. ఇక 2023 అక్టోబర్- డిసెంబర్ సమయంతో పోలిస్తే ఇప్పుడు కేవలం 2 శాతం పెరుగుదల మాత్రమే కనిపించింది.
కిందటి త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో ధరలు ఎక్కువగా పెరిగిన దాంట్లో అహ్మదాబాద్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ 7 శాతం మేర రేట్లు పెరిగాయి. ఇక ఇక్కడ కోల్‌కతాలో ఇళ్ల ధరలు 2 శాతం తగ్గడం గమనార్హం. ఇక చెన్నైలో ఎలాంటి మార్పు లేదు. ఏడాది ప్రాతిపదికన అయితే ఇళ్ల రేట్లు 4 శాతం ఎగబాకాయి. (ఏజెన్సీలు)