हैदराबाद: शहर के लोगों ने नये साल 2023 का जोरदार स्वागत किया। रात को 12 बजते ही लोगों ने हैप्पी न्यू ईयर के नारे लगाये और एक दूसरों को बधाई दी। लगभग सभी टीवी चैलनों में शहर में जारी नये साल के जश्न का सीधा प्रसारण किया। युवक, युवतियां महिला, पुरुष, बच्चे और बुजर्गों ने नये साल के जश्न में भाग लिया। कई पर भी कोविड़ नियमों का पालन नहीं किया गया। केंद्र और राज्य सरकार की चेतावनी/सुझाव का किस पर भी असर नहीं हुआ।
नए साल के जश्न की पृष्ठभूमि में हैदराबाद पुलिस ने कड़ा फैसला लिया है। हैदराबाद, साइबराबाद और रचाकोंडा पुलिस आयुक्तालयों में बड़े पैमाने पर शराब पीकर गाड़ी चलाने वालों की जांच की जाएगी। ट्रैफिक डीसीपी साइबराबाद टी श्रीनिवास राव ने साफ किया है कि शराब पीकर वाहन चलाने पर कानून के मुताबिक कार्रवाई की जाएगी।
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నారు. మద్యం సేవించి, వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
మద్యం సేవించి బండి నడిపితే మొదటిసారి రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి దొరికితే రూ. 15 వేలు జరిమానా, 2 సంవత్సరాల శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైస్సెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామని చెప్పారు. మొదటిసారి 3 నెలల సస్పెన్షన్, రెండోసారి దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు.
న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కొత్త ఏడాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మందు, మటన్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే మటన్ కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. షాపుల ముందు జనం బారులు తీరారు. ఇదే అదునుగా భావించిన మటన్ షాపు యజమానులు ఇష్టమొచ్చినట్టు రేట్స్ పెంచి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. మటన్ రేటు ఎంత ఉన్నా తగ్గేదేలా అంటూ జనం కొనుగోలు చేస్తున్నారు. ఖర్చుకూ ఎక్కడా వెనుకాడటం లేదు. అందుకే మటన్ షాపుల ముందు జనం కిటకిటలాడుతున్నారు. రాత్రి సమయంలో కూడా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ యువత డ్యాన్స్ లతో హోరెత్తిస్తున్నారు. వైన్ షాపుల ముందు అయితే మందుబాబులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఇయర్ సందర్భంగా నేషనల్ హైవే పై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పూటుగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మందు కొట్టి బైక్ నడుపుతున్న వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా మందుబాబులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. జరిమానాలకు భయపడకుండా మద్యం తాగి వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు.
भारत में नए साल का इंतजार कुछ ही घंटों में खत्म होने वाला है. लोग 12 बजने का बेसब्री से इंतजार कर रहे हैं। 12 बजते ही पूरे देश में नया साल जोर-शोर से मनाया जाएगा।
देश के लोग नए साल का जश्न मना रहे हैं, वहीं UPI भुगतान बंद हो गया है। सभी लोग खरीदारी में लगे हुए हैं। इस समय यूपीआई सेवाओं का निलंबन चिंताजनक है। इसके साथ ही यूपीआई को क्या हुआ, ट्विटर पर एक दौर शुरू हो गया। हजारों यूजर्स #UPIDOWN ट्वीट कर रहे हैं। लेकिन बहुत से लोग यह जाने बिना ही भुगतान कर रहे हैं। इससे हजारों रुपए पेमेंट गेटवे में फंस रहे हैं। इसे लेकर हजारों शिकायतें आ रही हैं।
దేశ ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. ప్రజలంతా షాపింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ సేవలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో యూపీఐకి ఏమైందంటూ ట్విట్టర్ లో గోల మొదలైంది. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే చాలా మందికి యూపీఐ డౌన్ (UPI Dowm) అయిందనే విషయం తెలియక పేమెంట్లు చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు పేమెంట్ గేట్ వేలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి.
యూపీఐ సేవల పునరుద్ధరణ విషయమై ఎన్పీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దీన్ని త్వరితగతిన పరిష్కరించకుంటే చాలా సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది యూపీఐ డౌన్ అయిందన్న సమాచారం తెలియక పేమెంట్స్ చేస్తున్నారు. ఫలితంగా వేల రూపాయలు పేమెంట్ గేట్ వద్ద ఇరుక్కుపోవడంతో వేల సంఖ్యలో ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. యూపీఐ సర్వీసులు డౌన్ కావడం ఫస్ట్ టేం కాదు. కానీ కీలకమైన టైంలో సర్వర్లు మొరాయిస్తుండటం యూజర్లను చికాకు పెడుతున్నది.
డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ సమాచారం ప్రకారం 60 శాతం మంది యూజర్లు యాప్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 30 శాతం మంది చెల్లింపుల్లో ఎర్రర్ చూపుతున్నదని పేర్కొంటున్నారు. మరో పది శాతం మంది నగదు బదిలీలో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ, చండీగఢ్‌ల్లో ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తున్నది.
सीएम केसीआर ने सभी देशवासियों को नववर्ष की शुभकामनाएं दीं। केसीआर ने कहा कि अतीत की समीक्षा, वर्तमान का विश्लेषण और भविष्य को लागू करके हम अपने जीवन को और अधिक गुणात्मक बना सकते हैं। युवाओं को विशिष्ट लक्ष्य बनाकर अपनी महत्वाकांक्षाओं को प्राप्त करने के लिए आगे बढ़ना चाहिए। सीएम ने दोहराया कि वे अपने लक्ष्यों को प्राप्त करने में तभी सफल होंगे जब उनका जीवन के प्रति सही दृष्टिकोण और इच्छा शक्ति होगी।
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని కేసీఆర్ తెలిపారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారని సీఎం పునరుద్ఘాటించారు.
ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కొంటూ నేడు భారతదేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్‌గా మారిందని తెలిపారు. 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని సీఎం కోరుకున్నారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కేసీఆర్ సూచించారు.
చికెన్ బిర్యాని
కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచం సిద్ధమైంది. ఈ వేడుకల వేళ హైదరాబాద్ కూడ సిద్దమైంది. హైదరాబాద్ వాసుల బెస్ట్ ఫుడ్ బెస్ట్ ఫుడ్ ఛాయిస్ చికెన్ బిర్యాని. చికెన్ బిర్యానికి కేరాఫ్ అడ్రస్ ఏంటి అంటే మాత్రం ఎక్కువ మంది వినియోగదారులు ‘బావర్చి బిర్యానీ’ పేరు చెబుతున్నారు. కిందటేడాది డిసెంబర్ 31న బావర్చి రెస్టారెంట్ రికార్డు స్థాయిలో బిర్యానీలను విక్రయించింది. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల కోసం మరింత ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఏకంగా 15 వేల కిలోల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావర్చి నిర్వాహకులు తెలిపారు.
సిటిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. యువత ఈవెంట్స్ లలో జాయిన్ అయ్యేందుకు బయల్దేరారు. నూతన సంవత్సరాన్ని గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు వెరైటీ కేక్స్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బార్లు, వైన్ షాప్స్ ముందు జనం బారులు తీరారు. పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘Swiggy’లో గత ఏడాది నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నిమిషానికి 9500 ఆర్డర్‌లను రికార్డ్ చేసింది. వీటిలో హైదరాబాద్ నగరం నుంచే ఎక్కువ ఆర్డర్లు రావడం విశేషం. అందులోనూ చికెన్ బిర్యానీ ఆర్డర్లే అధికం. దేశంలోని అతిపెద్ద ఆహార ప్రియుల్లో హైదరాబాదీలు తమ ఇష్టమైన బిర్యానీ వైపు మొగ్గు చూపారు. బిర్యానీకి గుర్తింపు పొందిన బావర్చి రెస్టారెంట్ గత ఏడాది స్విగ్గీలో నిమిషానికి 2 బిర్యానీలను విక్రయించడం ద్వారా నయా రికార్డును సృష్టించింది.
ఈ ఏడాది బిర్యానీ విక్రయాలు ఎక్కువగా ఉంటాయని బావర్చి వర్గాలు అంచనా వేశాయి. బావర్చి కిచెన్‌లో నేడు 15,000 కేజీల బిర్యానీని సిద్ధం చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో స్విగ్గీ కూడా ఇదే అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
शहर में नए साल का जश्न शुरू हो गया है। युवक और युवतियां कार्यक्रम में शामिल हो रहे हैं। नए साल का भव्य तरीके से स्वागत करने के लिए तरह-तरह के केक तैयार किए गये हैं। बार और शराब की दुकानों के सामने लोगों की कतार लग गई है। वे पुराने साल को अलविदा कहने और नए साल के स्वागत के लिए तैयार हैं।
పబ్స్, రిసార్ట్స్, ఈవెంట్లలో ఏర్పాటు చేసే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. రోడ్లపైకి వాహనాలు భారీగా చేరడంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం పోలీసులు కష్టంగా మారుతోంది.
पब, रिजॉर्ट और कार्यक्रमों में आयोजित नए साल के जश्न में हिस्सा लेने के लिए युवाओं में खासा उत्साह है। सड़कों पर वाहनों के भारी जमाव के कारण शहर के कई हिस्सों में ट्रैफिक जाम हो गया है। पुलिस के लिए ट्रैफिक नियंत्रित करना मुश्किल हो रहा है।
మరోవైపు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే తాటతీస్తామని హెచ్చరిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. కస్టమర్స్ను ఆకట్టుకునేలా వివిధ రకాల కేక్స్ ను తయారు చేస్తున్నారు బేకరి నిర్వాహకులు. 12 గంటలకు కేక్స్ కట్ చేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది.
तेलंगाना में नये साल का जोश है। शराब और केक दुकानों पर भारी भीड़ है। होटल, शहर के आसपास के रिजार्ट, क्लब, बार और रेस्टोरेंट्स हाउस फूल हो गये है। हर चेहरे पर खुशी दिखाई दे रही है। क्योंकि क्योंकि कोविड के कारण पिछले दो सालों में नया साल नहीं मनाया गया था। पुलिस रात 11 से पांच बजे तक ड्रंक एंड ड्राइव अभियान चलाएगी।
नए साल के मौके पर अगर कोई नशे में वाहन चलाता है तो उसे पर दस हजार रुपये जुर्माना और छह महीने जेल की सजा होगी। क्योंकि हैदराबाद, साइबराबाद और राचकोंडा पुलिस शराब के नशे में गाड़ी चलाने वालों पर जुर्माना लगाने का फैसला लिया है। नए साल के जश्न के मद्देनजर हैदराबाद, साइबराबाद और राचकोंडा पुलिस आयुक्तालयों में पुलिस बल को अलर्ट कर दिया गया है।
इसी क्रम में न्यूजीलैंड ने सबसे पहले नए साल 2023 का स्वागत किया। ऑकलैंड में नए साल का जश्न शुरू हो गया है। ऑकलैंडर्स निवासी भव्य समारोहों के साथ नए साल का स्वागत किया हैं। ऑकलैंड स्काई टावर में नए साल का जश्न धमाके के साथ शुरू हुआ। आतिशबाजी से जगमगाया स्काईटॉवर। कोविड के कारण दो साल से न्यू ईयर सेलिब्रेशन नहीं हुआ था। अब 2023 का भव्य समारोह पार्टियों और डीजे के साथ गूंज रहा है। परिवार और दोस्तों के साथ एंजॉय कर रहे हैं।
कुछ ही घंटों में पूरी दुनिया में नए साल का जश्न मनाया जाएगा। एक और घंटे में नया साल सिडनी में मनाया जाएगा। ऑस्ट्रेलिया में नए साल के जश्न के लिए सब कुछ तैयार है। बीते साल को कह रहे अलविदा लोग आने वाले साल का स्वागत कर रहे हैं।
संबंधित खबर:
New Year 2023 Update : తెలంగాణలో నూతన సంవత్సర ఉత్సాహం
Hyderabad : తెలంగాణలో నూతన సంవత్సరం ఉత్సాహంగా ఉంది. మద్యం, కేక్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. ప్రతి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా కొత్త సంవత్సరం వేడుకలు జరగలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఎవరైనా మందు తాగి బండి నడిపితే అంతే సంగతి. ఎందుకంటే మద్యం మత్తులో వాహనం నడిపిన వారికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఫైన్ వేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ రాత్రి నుంచి జనవరి 1 వరకూ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నుంచి బేగంపేట్, లంగర్‌హౌస్ మినహా అన్ని పై వంతెనలపై రాకపోకలు నిలిపివేయనున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు ఇప్పటికే తెలిపారు.
మరోవైపు, అందరికంటే ముందే న్యూఇయర్‌కు 2023 న్యూజిలాండ్ వెల్ కమ్ చెప్పేసింది. ఆక్లాండ్‌లో న్యూఇయర్ వేడుకలు మొదలయ్యాయి. ఆక్లాండ్ వాసులు న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. బాణసంచా వెలుగులతో స్కైటవర్ కాంతులు వెదజల్లింది. కోవిడ్ కారణంగా రెండు సంత్సరాల పాటు న్యూ ఇయర్ వేడుకలు జరగలేదు. ఇప్పుడు గ్రాండ్‌గా 2023 వేడుకలు పార్టీలు,డీజేలతో మారుమోగుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. మరో గంటలో సిడ్నీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోనున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆస్ట్రేలియాలో సర్వం సిద్ధమైంది. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ… రాబోయే సంవత్సరానికి ప్రజలు వెల్ కమ్ చెబుతున్నారు. (Agencies)