हैदराबाद: भारतीय रेलवे ने साल 2025 के लिए तत्काल ट्रेन टिकट बुकिंग नियमों में महत्वपूर्ण बदलाव किए हैं। ट्रेन टिकट बुक कराने वाले यात्रियों को अब इस नए नियमों का पालन करना होगा।
आईआरसीटीसी ने घोषणा की कि ये बदलाव ट्रेन सेवाओं को अधिक सुविधाजनक बनाने और पारदर्शिता बढ़ाने के लिए किए गए हैं। तत्काल टिकट बुकिंग जो पहले सुबह 10 बजे शुरू होती थी, अब सुबह 11 बजे शुरू होगी। यात्रियों को इस नये समय पर ध्यान देना चाहिए तथा अपनी बुकिंग पहले से ही कर लेनी चाहिए। तत्काल टिकटों के लिए एसी और नॉन एसी कोचों के लिए अलग-अलग कोटा भी निर्धारित किया गया है।
दूसरी ओर, आईआरसीटीसी ने गतिशील मूल्य निर्धारण नीति लागू की है। यह सुनिश्चित करने के लिए कदम उठाए जाएंगे कि टिकट की मांग और उपलब्धता के आधार पर कीमतों में उतार-चढ़ाव किया जा सकें। इस नीति से टिकटों में पारदर्शिता बढ़ेगी। तत्काल टिकट बुक कराने वालों के लिए आधार कार्ड अनिवार्य कर दिया गया है। यह नया नियम फर्जी टिकटों की बुकिंग को रोकने के लिए लागू किया गया है।
Aso Read-
अब तक तत्काल टिकट रद्द करने के लिए सख्त नियम थे। हालांकि, नए नियमों के अनुसार, आईआरसीटीसी ने 24 घंटे पहले टिकट रद्द करने वाले यात्रियों को अधिक रिफंड देने के लिए बदलाव किए हैं। आईआरसीटीसी ने सलाह दी है कि इन नए नियमों से तत्काल टिकट बुक करना आसान हो जाएगा और यात्रियों को इसके बारे में पहले ही जानकारी होने से वे अपनी यात्रा की योजना सुचारू रूप से बना पाएंगे। इसलिए रेल यात्री इस पर ध्यान दें और टिकट बुक करें।

మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త నియమాలు
హైదరాబాద్ : భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో 2025 సంవత్సరానికి కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
రైలు సేవలను మరింత సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకువచ్చినట్లు IRCTC ప్రకటించింది. ఇప్పటివరకు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి, తమ బుకింగ్‌కు ముందుగానే సన్నద్ధం కావాలి. తత్కాల్ టిక్కెట్ల కోసం AC, నాన్-AC కోచ్‌లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించారు.
మరోవైపు IRCTC డైనమిక్ ధర విధానాన్ని అమలు చేసింది. టికెట్ డిమాండ్, లభ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఈ విధానం టిక్కెట్లలో పారదర్శకతను పెంచనుంది. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన అమలు చేయబడింది.
ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి. అయితే, కొత్త మార్పుల ప్రకారం 24 గంటల ముందుగా టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు అధిక వాపసు లభించేలా IRCTC మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలతో తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం అవుతుందని, ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణ ప్రణాళికను సజావుగా చేసుకోవాలని IRCTC సూచించింది. కాబట్టి రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్ బుక్ చేసుకోగలరు. (ఏజెన్సీలు)