సమస్యలు పరిష్కరించకుంటే మిలిటెంటు పోరాటం చస్తాము: COC ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్  

హైదరాబాద్ : నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ (COC Telangana) ఆధ్వర్యంలో మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెన్షనర్లు మరియు ఉద్యోగుల డిమాండ్ల సాధనకై డాక్టర్ ఎస్. శ్రీధర్ అధ్యక్షతన ప్రెస్ మీటి జరిగినది. COC రాష్ట్ర జర్నల్ సెక్రెటరీ ఎన్. సోమయ్య, డ్యూపుటి జర్నల్ సెక్రెటరీ పి. శివలింగం, టేజరర్ ఎం. అర్జున్, కమిటీ మెంబర్స్ భార్గవాచారి, వై. వి సుధామ, రాజశేఖర్ రెడ్డి, జాఫర్ పాల్గొన్నారు.

శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జర్నల్ బడ్జెట్ తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్లును పార్లమెంటులో దొడ్డిదారిన ఎవరికి తెలియకుండా ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసినది. వెంటనే ఆ బిల్లును రద్దు చేయాలి లేక ఉపసంహరించుకోవాలి. బిఎస్ఎన్ఎల్ బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్డేషన్ చేయాలి. ఈపీఎఫ్-95 పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న న్యాయమైన వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. పెన్షన్ క్యామిటేషన్ విలువపై కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా పెనిషనర్స్ కు అదన పు పెన్షన్ మంజూరు చేయాలి. సీనియర్ సిటిజన్స్ కు రైల్వేలో బస్సులలో రాయితీలు పునరుద్ధరించాలి తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఎన్సిసి పిఏ/ఎఫ్ సి పి ఏ ఆధ్వర్యంలో పెన్షనర్ అందరము ఐకమత్యంతో పోరాడుతామని చెప్పారు.

ఎన్. సోమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పెన్షనర్ అందరము గత సంవత్సరం పొడుగున అనేక ఆందోళన పోరాటాలు చేసి ఢిల్లీ జంతర్మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడమైనది. భవిష్యత్తులో తమ న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వం నెరవేర్చనిచో రెండో దఫాగా అంతకంటే పటిష్టంగా మిలిటెంట్ గ పోరాటం ఎట్లా అయితే ఢిల్లీలో రైతంగం పోరాటం చేసి ప్రభుత్వం దిగివచ్చే విధంగా విరోచితంగా పోరాడినారు, ఆ మాదిరిగా పెన్షనర్ అందరము పోరాటం చేసి సాధిస్తామని చెప్పారు.

Also Read-

పి. శివలింగం మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన నిరసన ఆందోళన పోరాట వివరాలు వివరించారు. ఎం. అర్జున్ పత్రిక విలేకరులకు మీడియా విలేకరులకు హాజరైన కమిటీ నాయకులకు వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X