హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్లో గల హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు.
ఈ ఘటనపై ఫైర్ మెన్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 16 మందిని ఫైర్ మెన్ ఆదర్శ్ రక్షించినట్లు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని రెండు, మూడు అంతస్తుల్లో ఉన్నవారిని రిస్క్యూ ఆ పరేషన్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్కి తరలించామన్నారు.
రెండో అంతస్తులో ఉన్న ఆరుగురు పొగపీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా అలుముకున్నాయని ఆదర్శ్ చెప్పాడు.
ఇది కూడా చదవండి
పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందని అన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశామం కానీ, కానీ దురదృష్టశాత్తు ప్రాణాలు పోయారని పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించామని తెలిపారు. (ఏజెన్సీలు)