ఖమ్మం కలెక్టరేట్ వద్ద అలైన్ మెంట్ మార్చండి: ఎంపీ రవిచంద్ర

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ రవిచంద్ర

అమరావతి హైవే పై సవరణలకు వినతి:ఎంపీ రవిచంద్ర

సూర్యాపేట,తుప్రానుపేటల వద్ద అండర్ పాసులను ఏర్పాటు చేయండి:ఎంపీ రవిచంద్ర

సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించిన మంత్రి గడ్కరీ

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన గడ్కరీని కలిసి తమ తెలంగాణ రాష్ట్రం గుండా వెడుతున్న జాతీయ రహదారులపై నెలకొన్న సమస్యలను వివరించి, వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరారు.ఈ మేరకు ఎంపీ రవిచంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.

తమ రాష్ట్రంలోని ఖమ్మం మీదుగా వెళ్లే నాగపూర్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్ మెంటును ఖమ్మం కలెక్టరేట్ వద్ద మార్చాలని కోరారు. ప్రతిపాదిత హైవే మార్గం సమీకృత కలెక్టరేట్ మధ్య నుంచి వెడుతుందని, అది రాకపోకలకు అసౌకర్యంగా ఉండటం చేత, దానిని కలెక్టరేట్ వెనుక నుంచి వెళ్లేలా సవరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇదే హైవే పై ఖమ్మం, విజయవాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట సమీపాన కలిసే చోట, జాతీయ రహదారి నంబర్ 65 పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ వద్ద కూడా వాహనదారులు, పాదాచారుల సౌకర్యార్థం అండర్ పాసులను ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి కేంద్ర మంత్రికి ఎంపీ రవిచంద్ర వివరించారు. ఎంపీ తన దృష్టికి తెచ్చిన అంశాల పట్ల మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించి, వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X