ఆకాశంలో చుక్క‌లెన్ని ఉన్న చంద్రుడు ఒక్క‌డే, తెలంగాణ‌లోనూ కేసీఆర్ ఒక్క‌డే: ఎమ్మెల్సీ క‌విత

ప్రజలకు జిమ్మేదార్ నేతలు కావాలి… నిద్రపోయో చౌకీదార్లు కాదు

19 లక్షల కోట్లు మాఫీ చేశామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి…కార్పోరేట్ శక్తుల పక్షపాతి

వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు జారీ చేయ‌డం స‌రికాద‌న్నారు. ఆ డ‌బ్బుల‌ను తిరిగి చెల్లించాల‌ని కేంద్రం ఆదేశించడం అత్యంత దారుణం, హేయం, బాధాక‌రం

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్సీ క‌విత ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు జారీ చేయ‌డం స‌రికాద‌న్నారు. ఆ డ‌బ్బుల‌ను తిరిగి చెల్లించాల‌ని కేంద్రం ఆదేశించడం అత్యంత దారుణం, హేయం, బాధాక‌రం అని పేర్కొన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం అని నిరూపించుకుంద‌న్నారు.

తెలంగాణ ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారు

రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి జిల్లా కేంద్రంలో రైతు మ‌హాధ‌ర్నా జ‌ర‌గ‌బోతున్న‌ద‌ని తెలిపారు. రైతులంద‌రూ ఈ ధ‌ర్నాలో పాల్గొని బీజేపీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌న హ‌క్కులు సాధించుకోవాలంటే ధ‌ర్నా పెద్ద ఎత్తున జ‌రగాలి. చుక్క‌లు ఎన్ని ఉన్న చంద‌మామ ఒక్క‌డే అన్న‌ట్టు, ఎన్ని పార్టీలు వ‌చ్చినా, ఏమోచ్చినా తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేట‌టువంటి వ్య‌క్తి కేసీఆరే మాత్ర‌మే అని పేర్కొన్నారు. చంద్ర‌బాబు లాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌లు న‌మ్మ‌రు. చంద్ర‌బాబును ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. భ‌విష్య‌త్‌లోనూ అదే జ‌ర‌గ‌బోతుంద‌న్నారు. ఆ పార్టీలు ప్ర‌జ‌ల‌ను శ్రేయ‌స్సు కోరే పార్టీలు కావు. తెలంగాణ ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారు అని క‌విత స్ప‌ష్టం చేశారు.

దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తాం

బీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఏ కార్యక్రమం చేపట్టినా పేదల మేలు కోసమేనని చెప్పారు. నిజామాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎమ్మెల్యేలు గణేశ్‌ గుప్తా, జీవన్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ కవిత పంపిణీ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా 116 సాయం అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

నగరంలో పాత భవనాల కూల్చివేసి ప్రజా ప్రయోజన కట్టడాలు నిర్మిస్తాం

గతంలో కరెంటు కోసం ఎన్నో బాధలు పడ్డామని, ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే ఒక వార్త అని చెప్పారు. నిజామాబాద్‌ను అద్భుతనగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నగరంలో పాత భవనాల కూల్చివేసి ప్రజా ప్రయోజన కట్టడాలు నిర్మిస్తామన్నారు. పాత బస్టాండ్‌ను తొలగించి రైల్వేస్టేషన్‌ దగ్గర నూతన నిర్మిస్తామన్నారు. పాత కలెక్టరేట్‌ స్థానంలో కళాభారతిని, మైనార్టీల కోసం హజ్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరం నలుమూలలా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీజేపీ నాయకులు ప్రజలను అనవసరంగా ఆగమాగం చేయొద్దని హితవు పలికారు

చుక్కలెన్ని ఉన్నా… చందమామ ఒక్కటే

ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన శంఖారావం సభపై నిజామాబాద్‌లో ఆమె స్పందించారు. చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కటేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీలు ఎన్నున్నా.. కేసీఆర్‌ ఒక్కరేనన్నారు. చంద్రబాబు మళ్లీ వచ్చి మాట్లాడుతున్నారని, పార్టీని పునర్మించాలని పిలుపునిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ కాదన్నారు కవిత. గతంలో ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారన్నారు. ప్రస్తుతం కూడా అదే జరుగుతుందన్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.

తెలంగాణలోకి మళ్లీ రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు.. టీడీపీ ఇప్పటీకే భూ స్థాపితమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవు’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X