“బీసీల‌కు ఇచ్చిన హామీల‌ను విస్మ‌రిస్తే ఊరుకునే ప్ర‌సక్తే లేదు”

ఎంబీసీల‌కు ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏమైంది ?

వ‌డ్డెర సంఘం నాయ‌కుల స‌మావేశంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొంది

పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం

సారంగాపూర్ కస్తూర్బా పాఠశాల ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బీసీల‌కు ఇచ్చిన హామీల‌ను విస్మ‌రిస్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తేల్చిచెప్పారు. కామారెడ్డి బీసీ డిక్ల‌రేష‌న్ తో పాటు ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చేర్చిన ఇత‌ర హామీల‌ను అమ‌లను త్వ‌ర‌గా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎంబీసీల కోసం ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామ‌ని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల‌ని సూచించారు.

తెలంగాణ వ‌డ్డెర సంఘం నాయ‌కులు బుధ‌వారం నాడు ఎమ్మెల్సీ క‌విత‌ను త‌న నివాసంలో క‌లిశారు. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు పెంపుపై బీసీ డెడికేటెడ్ క‌మిష‌న్ కు తెలంగాణ జాగృతి సంస్థ త‌ర‌ఫున నివేదిక స‌మ‌ర్పించినందుకు ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.

[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏడాది గ‌డిచినా ఎంబీసీల కోసం ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ప్ర‌తి జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల‌తో బీసీ ఐక్యత భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌ని ఇచ్చిన హామీల అమ‌లు క‌నీస చ‌ర్య తీసుకోలేద‌ని ఎండ‌గ‌ట్టారు.

స్థానిక సంస్థ‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింద‌ని, దాన్ని అమ‌లు చేయ‌డంలో తాత్సారం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. కులవృత్తుల వారికి ఈ ప్ర‌భుత్వం క‌నీస మ‌ద్ధ‌తునివ్వ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

Also Read-

సారంగాపూర్ కస్తూర్బా పాఠశాల ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ

జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగించిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత తెలిపారు.

ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించాలి. వాటి పరిస్థితులపై సమీక్ష చేసి ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X