हैदराबाद: हाईकोर्ट ने विधायक खरीद-फरोख्त मामले की सुनवाई दोपहर तक के लिए स्थगित कर दी। इस मामले की सुनवाई दोपहर 2.30 बजे फिर से शुरू होगी। सुबह सुनवाई करने वाली पीठ ने सरकार से मामले को लेकर सुप्रीम कोर्ट द्वारा दिए गए आदेश की प्रति उपलब्ध कराने को कहा। हालांकि, सरकारी वकील ने पीठ को बताया कि आदेश की प्रति अभी तक अपलोड नहीं की गई है। उन्होंने कहा कि संभव है कि आज शाम को सुप्रीम कोर्ट का आदेश आ जाएगा। इसके साथ ही जज ने साफ कर दिया कि सुप्रीम कोर्ट के आदेश की कॉपी देखने के बाद ही मामले की सुनवाई की जाएगी।
सबूतों से छेड़छाड़ की आशंका
एजी ने अदालत के संज्ञान में लाया कि बीएल संतोष नोटिस दिए जाने के बावजूद एसआईटी की सुनवाई में शामिल नहीं हुए। बीएल संतोष इस महीने की 16 तारीख से उपलब्ध नहीं हैं। उन्होंने कहा कि कल आखिरकार उनके कार्यालय में नोटिस दिया गया। आरोप लगाया कि जानबूझकर संतोष नोटिस लिए बिना समय बर्बाद कर रहे है। एजी ने पीठ से कहा कि संतोष के खिलाफ कई संदेह हैं और अगर वह एसआईटी की जांच में शामिल नहीं होते हैं तो सबूतों से छेड़छाड़ का खतरा है। उन्होंने कहा कि जांच में शामिल होने पर कई बातें सामने आएंगी।
बीजेपी क्यों नहीं ले रही जिम्मेदारी
एजी की दलीलों पर प्रतिक्रिया देते हुए जस्टिस ने कहा कि बीएल संतोष की जिम्मेदारी बीजेपी ने ली है। इस मामले में बीजेपी के प्रदेश सचिव प्रेमेंदर रेड्डी जिम्मेदारी क्यों नहीं ले रहे हैं। बीएल संतोष ने एसआईटी के नोटिस का जवाब दिया और स्पष्ट करने का आदेश दिया कि वह 41ए के नोटिस को चुनौती देंगे या नहीं। बीजेपी के वकीलों से सवाल किया कि वह बताएं कि क्या उन्हें एसआईटी के सामने पेश होने के लिए और समय चाहिए।
एक पेशेवर की तरह बहस करें
जज के सवाल का जवाब देते हुए बीजेपी के वकील ने कहा कि बीएल संतोष ने कानूनों की अवहेलना नहीं की है। वह एक नेता होने के कारण राजनीति में व्यस्त हैं। अदालत के संज्ञान में यह बात लाई गई कि संतोष ने एसआईटी को पत्र लिखा है कि वह सुनवाई में शामिल होने में असमर्थ है, क्योंकि वह यात्रा पर रहा है। एजी ने कहा कि संतोष के फोन में बहुत सारे सबूत हैं। सुनवाई के लिए नहीं आता है तो सबूतों के साथ छेड़छाड़ किये जाने की संभावना है। हाईकोर्ट ने दोनों पक्षों की दलीलें सुनीं और दोनों पक्षों के वकीलों को खरी-खोटी सुनाई। बीजेपी और टीआरएस के नेताओं की तरह बहस नहीं करने की सलाह दी। सुझाव दिया कि पेशेवर रूप से बहस करनी चाहिए और विधानसभा की तरह बहस नहीं करनी चाहिए।
ఫాం హౌస్ కేసు : విచారణ మధ్యాహ్నానికి వాయిదా
Hyderabad: ఫాం హౌస్ కేసు విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ మధ్యాహ్నం 2.30గంటలకు తిరిగి చేపడతామని ప్రకటించింది. ఉదయం విచారణ జరిపిన ధర్మాసనం.. కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగింది. అయితే ఆర్డర్ కాపీ ఇంకా అప్లోడ్ కాలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఈ రోజు సాయంత్రానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశముందని చెప్పారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ కాపీ చూశాకే విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
సాక్ష్యాలు తారుమారయ్యే ఛాన్స్
నోటీసులు ఇచ్చినా బీఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నెల 16వ తేదీ నుంచి బీఎల్ సంతోష్ అందుబాటులోకి రాలేదని, నిన్న ఎట్టకేలకూ ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేసినట్లు చెప్పారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సంతోష్పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆయన సిట్ విచారణకు హాజరుకాకపోతే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదముందని ఏజీ ధర్మాసనానికి చెప్పారు. ఆయన విచారణకు హాజరైతే చాలా విషయాలు బయటపడతాయని అన్నారు.
బీజేపీ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు
ఏజీ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి బీఎల్ సంతోష్ బాధ్యతను బీజేపీ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్ సిట్ నోటీసులపై స్పందించి 41ఏ నోటీస్ ను ఛాలెంజ్ చేస్తారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలని ఆదేశించారు. ఆయన సిట్ ఎదుట హాజరయ్యేందుకు మరింత సమయం కావాలంటే చెప్పాలని బీజేపీ న్యాయవాదులను ప్రశ్నించారు.
ప్రొఫెషనల్స్లా వాదించండి
న్యాయమూర్తి ప్రశ్నకు స్పందించిన బీజేపీ తరఫు లాయర్.. బీఎల్ సంతోష్ చట్టాలను ధిక్కరించలేదని అన్నారు. పొలిటీషియన్ అయినందున రాజకీయాల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. తాను ప్రయాణంలో ఉన్నందునే విచారణకు రాలేకపోతున్నానని సిట్ కు లేఖ రాసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే సంతోష్ ఫోన్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయన్న ఏజీ ఆయన విచారణకు రాకుండా ఎవిడెన్స్ తారుమారు చేసే అవకాశముందని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ, బీజేపీ తరఫు న్యాయవాదులకు చురకలంటించింది. బీజేపీ, టీఆర్ఎస్ తరఫు నాయవాదుల్లా మాట్లాడొద్దని సూచించింది. ప్రొఫెషనల్ గా వాదించాలే తప్ప అసెంబ్లీలో లాగా వాదనలు చేయవద్దని సూచించింది. (Agencies)