हैदराबाद: चुनाव में किए गए वादे के मुताबिक रेवंत रेड्डी सरकार ने तेलंगाना में महिलाओं को मुफ्त बस यात्रा की सुविधा प्रदान की है। परिणामस्वरूप, आरटीसी बसों में पहले की तुलना में अधिक भीड़ से चल रही है। हालाँकि अब तक यह सब ठीक रहा है, लेकिन आरोप लग रहे हैं कि महिलाओं के लिए मुफ्त यात्रा टिकट से कंडक्टरों पर पैसों की बारिश हो रही है।
आरोप सुनने को मिल रहे हैं कि कुछ कंडक्टर महालक्ष्मी योजना के तहत दिये जाने वाले मुफ्त टिकट पुरुषों को दे रहे हैं। अगर कोई यात्री इस बारे में पूछते हैं तो वे टिकट फाड़ देते हैं और बदले में दूसरा टिकट दे देते हैं। कहते है कि गलती से दिया गया है। अगर कोई नहीं पूछता है तो पैसा उनकी जेब में चला जा रहा है।
हाल ही में एक यात्री ने 26 जून को कोत्तापेट से सरूरनगर तक बस से यात्रा की। कंडक्टर ने उसे महिलाओं को दिये जाने वाला मुफ्त टिकट दे दिया। इसी तरह एक अन्य यात्री 7 जुलाई को एलबी नगर से मन्नेगुडा तक यात्रा की, तो कंडक्टर ने उसे भी शून्य टिकट दे दिया। इसी तरह 4 अगस्त को एक अन्य यात्री सरूर नगर से दिलसुखनगर तक यात्रा की। कंडक्टर ने उससे पैसे लेकर मुफ्त टिकट दे दिया।
हालांकि, आरटीसी यूनियन के नेताओं ने कंडक्टरों पर लगे आरोपों से इनकार किया है। उन्होने कहा कि कहीं न कहीं हुई गलती के लिए पूरी आरटीसी सिस्टम को जिम्मेदार ठहराना गलत है। महालक्ष्मी योजना के बाद आरटीसी ड्राइवरों और कंडक्टरों को गंभीर समस्याओं का सामना करना पड़ रहा है। महिला यात्रियों ने अनेक जगहों पर ड्राइवर और कंडक्टर के साथ दुर्व्यवहार किया। कुछ मारपीट की घटनाएं भी हुईं है।
एसोसिएशन के नेताओं ने इस बात से इनकार किया है कि महिलाओं को दिये जाने वाले शून्य टिकट पुरुषों को टिकट दिए जाते हैं। नेताओं ने यह भी कहा कि इस तरह कंडक्टरों के विरुद्ध दुष्प्रचार न करें और उनकी भावनाओं को ठेस न पहुंचाये। समाचार पत्र भी तथ्य की जानकारी के बाद ही समाचार प्रकाशित न करें।
यह भी पढ़ें-
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సులు ఇంతకు ముందు కన్నా మరింత రద్దీతో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా మహిళలకు ఉచిత ప్రయాణం కండక్టర్లకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు కండక్టర్లు తెలివిగా పురుషులు తీసుకునే టికెట్‌ను కూడా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్ ఇస్తూ డబ్బులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటున ఇచ్చానంటూ ఆ టికెట్ చించి మరో టికెట్ ఇస్తున్నారు. ఎవరూ అడగకపోతే ఆ డబ్బులు వారి జేబుల్లోకే వెళ్తున్నాయి.
తాజాగా ఓ ప్రయాణికుడు జూన్ 26న కొత్తపేట్ నుంచి సరూర్‌నగర్ వరకు బస్సులో వెళ్లాడు. దీంతో అతడికి సదరు కండక్టర్ మహిళలకు ఇచ్చే ఫ్రీ టికెట్ ఇచ్చాడు. అదేవిధంగా మరో ప్రయాణికుడు జూలై 7న ఎల్బీ నగర్ నుంచి మన్నెగూడ వెళ్లగా అతడికి కూడా కండక్టర్ జీరో టికెట్ పంచ్ చేశాడు. ఇక ఆగస్టు 4న ఆదివారం మరో ప్రయాణికుడు సరూర్ నగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లగా అతడి నుంచి కండక్టర్ డబ్బులు తీసుకుని ఫ్రీ టికెట్ ఇచ్చినట్లుగా సదరు ప్రయాణికుడు వాపోయాడు.
అయితే కండక్టర్లపై వస్తున్న ఆరోపణలను ఆర్టీసీ యూనియన్లు ఖండిస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర జరిగిన పొరపాటును పూర్తిగా ఆర్టీసీ వ్యవస్థకే అంటగట్టడం సరికాదని మండిపడ్డాయి. మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయాయి. మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడంతోపాటు దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయని తెలిపాయి.
మహిళలకు మాత్రమే జీరో టికెట్ ఇస్తారని, పురుషులకు ఇస్తున్నారనే ప్రచారం పూర్తిగా అబద్దమని ఆర్టీసీ సంఘాలు ఖండించాయి. కండక్టర్లపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, వారి మనోభావాలు దెబ్బతీయవద్దని, పత్రికలు సైతం నిజానిజాలు తెలుసుకోని వార్తలు రాయాలని హితవు పలికాయి. (ఏజెన్సీలు)
