అంబేద్కర్ గారి మీద ఉన్న అపార గౌరవంతో కేసిఆర్ నూతన సెక్రటేరియట్ కు ఆయన పేరు పెట్టారు: మంత్రి వేముల

అందుకు తగ్గట్టు అధికారులు,వర్క్స్ ఏజన్సీ మనసుపెట్టి పనిచేయాలి

కొత్త సెక్రటేరియట్ ఫినిషింగ్ పనుల్లో ఇంకా వేగం పెంచాలి

రేయిలింగ్ ఫిక్సింగ్ కు నెల లోపే సిద్దం చేయాలి

ఫాల్స్ సీలింగ్ పనులు త్వరితగతిన నెల రోజుల్లో పూర్తి కావాలి

కింది నుంచి పై అంతస్తు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలి

ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు.. డా. బి. ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పురోగతి పనులను బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా సుమారు మూడున్నర గంటల పాటు కలియతిరిగారు. పర్ట్ చార్ట్ ప్రకారం ఫ్లోర్ వైస్ పనుల పురోగతి పరిశీలించారు. అనంతరం అక్కడే ఆర్ అండ్ బి అధికారులతో, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోపు అన్ని రకాల నిర్మాణ ఫినిషింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. పర్ట్ చార్ట్ ప్రకారం బ్లాకుల వారిగా.. ఫ్లోర్ వైస్ పనులు సమాంతరంగా నాణ్యతతో జరగాలన్నారు. రెడ్ సాండ్ స్టోన్, క్లాడింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. మెయిన్ ఎంట్రన్స్, పోర్టిగో, మెట్ల మార్గంతో పాటు అన్ని ఫ్లోర్లలో ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు.

నెలలోపు ఫాల్స్ సీలింగ్ వర్క్స్ పూర్తి కావాలని, అదే గడువు వరకు రెయిలింగ్ ఫిక్సింగ్ కోసం సిద్దం చేయాలని చెప్పారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రీ, ఫౌంటెన్ నిర్మాణం, డొమ్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, బ్లాక్ వైస్ జరుగుతున్న పలు ఫినిషింగ్ పనులపై అధికారులతో కూలంకషంగా, సుదీర్ఘంగా చర్చించారు. అన్ని రకాల పనులు సమాంతరంగా మూడు షిఫ్టుల్లో జరగాలని.. అవసరమైతే వర్కర్స్ ని పెంచుకోవాలని సూచించారు.

కేసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కట్టడం నిర్మిస్తోందని, చారిత్రాత్మక ఈ ప్రభుత్వ పరిపాలన భవన నిర్మాణానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. అంబేద్కర్ గారు అంటే కేసిఆర్ గారికి అమితమైన ప్రేమ, అపార గౌరవం అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే వారి మాటలు ఆచరణీయమని, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని కేసిఆర్ గారు పలు మార్లు గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.

అందుకే ఆయన పేరున్న ఈ పరిపాలన భవనం నుంచే పాలన సంస్కరణలు జరగాలనే సదుద్దేశంతో వారి పేరు పెట్టారని చెప్పారు. అందుకోసమే అధికారులు, వర్క్స్ ఏజన్సీ ప్రతినిధులు మనసుపెట్టి ఫినిషింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా తప్పనిసరి అన్ని రకాల పనులు పూర్తికావాలని మంత్రి అధికారులకు,నిర్మాణ సంస్థ ప్రతినిధులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్. ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈ. ఈ. శశిధర్, పలువురు ఆర్ అండ్ బి
అధికారులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X