భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉద్యోగులు, విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠికా పఠనం చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘సామాజిక సాధికారత ఉత్సవాల్లో’ భాగంగా ఆదివారం డా. బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద “భారత రాజ్యాంగ పీఠిక”ను ఉద్యోగులు, విద్యార్థుల చేత మంత్రి పఠనం చేయించారు. రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యన్నతికి కృషి చేసిన డా. బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహానీయులను స్మరిస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “సామాజిక సాధికారత ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. పోరాడి సాధించిన హక్కులను కాపాడుకోవాలని సూచించారు. విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధమని, విద్యకు ఉండే విలువను రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే గుర్తించారని పేర్కొన్నారు. సమాజాన్ని నిర్మించడానికి, చైతన్య పరచడానికి విద్యయే సరైన మార్గమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

Also Read-

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్ర్రంలో ఉన్నత విద్యా వ్యాప్తికి, పేదల అభ్యున్నతికి అంబేద్కర్ ఓపెన్ వర్సీటీ చేస్తున్న కృషిని వివరించారు. పేదల అభివృద్ధికి పాటు పడుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కట్టుబడి ఉందని, కొత్త భవనాలకు నిధులను కేటాయించిందని, ఆ నిధులను త్వరలో విడుదల చేసేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రిని విశ్వవిద్యాలయ బీసీ ఉద్యోగుల సంఘం ఉద్యోగులు జానీ మియా, విశ్వనాథ్ తదితరులు సన్మానం చేశారు.

ఆ తర్వాత విశ్వవిద్యాలయంలోని మినీ ఆడిటోరియంలో “డా. బాబాసాహెబ్ అంబేద్కర్” జీవితంపై ప్రత్యేక చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిలుగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి; పలు విభాగాల డైరక్టర్లు, డీన్లు, ప్రొ. సుధారాణి, ప్రొ. ఆనంద్ పవర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. పల్లవీ కాబ్డే, ప్రొ. రవీంద్రనాథ్ సోలోమన్, ప్రొ. బోజు శ్రీనివాస్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. ఎన్ రజిని, డా. వై వెంకటేశ్వర్లు, డా. బానోత్ ధర్మా, డా. కె. కృష్ణా రెడ్డి, డా. రమాదేవి, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X