హైదరాబాద్ : హన్మకొండ పర్యటనలో భాగంగా ఆదివారం హన్మకొండ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారిని కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు దర్శించుకున్నారు.
శ్రీ భద్రకాళి అమ్మవారిని మంత్రి మంగళవారం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మంత్రి గారి వెంట రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి స్వాగతం పలికిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి.